పోరాటాలు మరింత ఉధృతం
ఆదిలాబాద్‌టౌన్: మహిళల హక్కులు, భద్రత, సామాజిక, ఆర్థిక సమానత్వం కోసం పో రాటాలను మరింత ఉధృతం చేస్తామని ఐద్వా కేంద్ర కమిటీ సభ్యురాలు టి.జ్యోతి అన్నారు. జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో గురువారం నిర్వహించిన అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) కార్యవర్గ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. కార్యదర్శిగా ఆర్.మంజుల, కోశాధికారిగా టి.ప్రభా వతి ఎన్నిక కాగా, అధ్యక్షురాలిగా కోవె శకుంతల కొనసాగనున్నారు. అనంతరం మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై విస్తృతంగా చర్చించి, భవిష్యత్తు కార్యాచరణ రూపొందించారు. కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆశలత, జిల్లా కమిటీ సభ్యులు పి.రాధ, గంగసాగర్ తదితరులు పాల్గొన్నారు.


