పర్యావరణహితమే లక్ష్యం
ఆదిలాబాద్: పర్యావరణహితంగా సంక్రాంతి పండుగ జరుపుకోవాలని ట్రెయినీ అసిస్టెంట్ కలెక్టర్ సలోని చాబ్రా అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన కై ట్ ఫెస్టివల్‌ను ఆమె ప్రారంభించి మాట్లాడారు. పండుగను ప్రతి ఒక్కరూ సంతోషంగా, సురక్షితంగా జరుపుకోవాలన్నారు. కాగితపు పతంగులు, సాధారణ దారం మాత్రమే వినియోగించాలని సూచించారు. పర్యావరణానికి హాని కలిగించే చైనా మాంజా నిషేధమన్నారు. కార్యక్రమంలో డీఎస్సీడీవో బి.సునీత, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్ రావు, ఎస్‌డబ్ల్యూవోలు నారాయణరెడ్డి, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.


