ఆదివాసీలకు అండగా ఉంటాం
ఆదిలాబాద్‌టౌన్: సాత్నాల మండలంలోని దుబ్బ గూడ కొలాం ఆదివాసీలకు అండగా ఉంటామని అఖిలపక్ష రాజకీయ పార్టీల నాయకులు స్పష్టం చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని సీపీఎం కా ర్యాలయంలో అఖిలపక్ష, ఆదివాసీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆదివాసీలను అటవీ శాఖ అధికారులు ఇబ్బందులకు గురిచేయడం సరి కాదన్నారు. తక్షణమే ఇళ్ల నిర్మాణాలు చేపట్టేలా కలెక్టర్ చొరవ చూపాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లను అట వీ అధికారులు అడ్డుకుంటే సహించేది లేదన్నారు. 12న డీఎఫ్‌వో కార్యాలయ ముట్టడి, 16న సాత్నాల మండల బంద్ చేపడతామని స్పష్టం చేశారు. సమావేశంలో లంకా రాఘవులు, దర్శనాల మల్లేశ్, నగేశ్, సచిన్, వెంకటనారాయణ, దేవేందర్, దాదారావ్, మనోజ్, వసంత్‌రావు, గోవింద్, శేషారావు, దత్తాత్రి, మంజుల, ప్రభావతి, రాధ, గంగాసాగర్ తదితరులు పాల్గొన్నారు.


