● ఉచితమనేసి.. ఊరికి మానేసి
ఉచిత బస్సు అన్నారు.. ఊరికి దూరం చేశారు.. చివరికి ప్రైవేట్ వాహనాలే ఆధారంగా మార్చారు.. శనివారం నుంచి పాఠశాలలకు సెలవులు కావడంతో శుక్రవారం మధ్యాహ్నం నుంచే విద్యార్థులు తమ స్వగ్రామాలకు పయనం అయ్యారు. మండల కేంద్రాలకు తప్పించి చాలా ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు లేక విద్యార్థులు భారీ లగేజీతో ప్రమాదం అయినప్పటికీ ఆటోలు, జీపులను ఆశ్రయించారు. అడ్డతీగలలో లగేజీ బ్యాగ్‌లతో పాటు విద్యార్థులను పరిమితికి మించి ఆటోలు, జీపుల్లో ఎక్కించుకుని రయ్‌రయ్‌మంటూ ముందుకు కదిలారు. ప్రమాదం అంచున ఈ ప్రయాణాలు సాగించారు.
– అడ్డతీగల
● ‘అతిథి’ కాదు అవస్థల గృహం
చుట్టూ పిచ్చిమొక్కలు.. నాచుపట్టిన గోడలు.. అడుగడుగునా తుప్పలు.. శిథిలమైన భవనాలు.. వీటిని చూస్తే భయానకమే. ఇది ఎక్కడో మారుమూల ప్రాంతంలో కాదండోయ్.. మండల కేంద్రం రాజవొమ్మంగిలో ప్రభుత్వ ఉద్యోగుల వసతి గృహాలు (99 క్వార్టర్స్) ప్రాంతంలోని ఐటీడీఏ పీఓ అతిథి గృహం పరిస్థితి ఇది. ఇది పూర్తిగా శిథిలస్థితికి చేరి ఇలా భయానకంగా మారింది. కనీసం అక్కడ శుభ్రపరిచే నాథుడు కరవయ్యాడు. విషసర్పాలకు ఇది నిలయమైంది.
– రాజవొమ్మంగి
● ముందే వచ్చిన సం‘క్రాంతి’
తెలుగు వారికి సంక్రాంతి పెద్ద పండగే.. అలాంటి పండగకు ఊరూవాడా సిద్ధమైంది. ఇప్పటికే ముందస్తు వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అడ్డతీగలలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సంక్రాంతి సంబరాలను శుక్రవారం నిర్వహించారు. రంగవల్లుల, వివిధ ఆటల, డ్రాయింగ్ పోటీలను జరిపారు. విజేతలకు బహుమతులు అందజేశారు. విద్యార్థులు మన సంప్రదాయాలను గౌరవించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించారని ఎంఈఓలు రమేష్, పి.శ్రీనివాసరావు తెలిపారు. హెచ్‌ఎం బి.వెంకటలక్ష్మి పాల్గొన్నారు.
– అడ్డతీగల
● ఉచితమనేసి.. ఊరికి మానేసి
● ఉచితమనేసి.. ఊరికి మానేసి


