అంధుల జీవితాల్లో వెలుగు నింపిన బ్రెయిలీ
కైలాస్‌నగర్: అంధుల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు లూయిస్ బ్రెయిలీ అని అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి పేర్కొన్నారు. లూయిస్ బ్రెయిలీ జయంతిని గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించారు. శ్యామలాదేవి అంధత్వ చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి పలువురికి తినిపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిన్నతనంలోనే చూపు కోల్పోయిన బ్రెయిలీ 17 ఏళ్లలోనే తాను చదివిన పాఠశాలలో ప్రొఫెసర్‌గా పనిచేశారని తెలిపారు. అంధత్వంతో కలిగే ఇబ్బందులను ఎదుర్కొన్న ఆయన అంధులు తేలికగా చదవగలిగే, రాయగలిగే ప్రత్యేక లిపి త యారు చేశారని పేర్కొన్నారు. ఎంతో శ్రమించి సృష్టించిన ఈ లిపి ప్రస్తుతం ఎందరో అంధుల జీవి తాల్లో వెలుగులు నింపుతోందని తెలిపా రు. లూయిస్ బ్రెయిలీని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సమస్యలుంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఆమె వెంట జిల్లా సంక్షేమాధికా రి మిల్కా తదితరులు పాల్గొన్నారు.


