సాయజ్ గ్రామాన్ని సందర్శించిన అఖిలపక్షం
సాత్నాల: మండలంలోని దుబ్బగూడ అనుబంధ సాయజ్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల కు అటవీశాఖ అడ్డుపడడంతో కొలాం, ఆదివాసీలు కలెక్టరేట్ ఎదుట ఏడురోజులుగా నిరవధిక దీక్షలు చేపడుతుండగా వారికి మద్దతుగా.. అఖిలపక్ష, ప్ర జాసంఘాల నాయకులు శుక్రవారం ఆ గ్రామాన్ని సందర్శించారు. వారు మాట్లాడుతూ.. కొలాం, ఆ దివాసీల ఇళ్ల నిర్మాణాన్ని అటవీశాఖ అడ్డుకోవడం సరికాదని, ఇది రెవెన్యూ భూమిగానే ఉందని నిర్ధారించారు. రెవెన్యూ పట్టా ఉండి 40 ఏళ్లు నివాసము న్నా అటవీశాఖ భూమి అనడం ఏమాత్రం సమంజసం కాదని పేర్కొన్నారు. తక్షణమే కలెక్టర్ రాజర్షి షా చొరవ చూపి సమస్య పరిష్కారానికి కృషి చే యాలని, అటవీశాఖ మానవతా దృక్పథంతో ఆది వాసీల ఇళ్ల నిర్మాణాలు జరిగేలా చూడాలని కోరా రు. అత్యంత వెనుకబడ్డ ఆదివాసీలపై చిన్నచూపు తగదని, వారి అభివృద్ధికి ఆటంకం కలగకుండా ఇండ్ల నిర్మాణం జరిగేలా చూడాలని కోరారు. ఆగి పోయిన ఇండ్లకు వెంటనే నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేశ్, ఏరియా కమిటీ కార్యదర్శి లంకా రాఘవులు, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి సిర్రా దేవేందర్, న్యూ డెమోక్రసీ నాయకుడు వెంకట్‌నారాయణ, ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్, సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు గోవిందరావు, దుబ్బగూడ సర్పంచ్ జాదవ్ కాలురాం, సాంగ్వి సర్పంచ్ ఆత్రం నగేశ్, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి తనుష్, ఉపాధ్యక్షుడు మాడవి నాగరావ్ తదితరులున్నారు.


