అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు.. భూముల స్వాధీనం
కైలాస్‌నగర్: భూమి కొనుగోలు పథకం కింద ఆది లాబాద్ రూరల్ మండలం అనుకుంట గ్రామానికి చెందిన అడ్డురి రమణాబాయి సర్వే నంబర్ 83లో ఎకరా 15గుంటలు, సిరికొండ మండలానికి చెందిన కుమరం జంగు బాపునకు సర్వే నంబర్ 57/అ/1లోని ఆరెకరాల 18గుంటల భూమిని ప్రభుత్వం కేటాయించింది. కొంతమంది అక్రమార్కులు వీరి భూములను తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో తమ పేరిట పట్టా చేసుకున్నారు. దీంతో బాధితులు కలెక్టర్ రాజర్షి షాకు ఫిర్యాదు చేయగా విచారణకు ఆదేశించారు. విచారణ చేపట్టిన రెవెన్యూ అధికారులు అక్రమంగా జారీ చేసిన పట్టాలను రద్దు చేసి భూ ములు స్వాధీనం చేసుకున్నారు. తిరిగి అసలైన లబ్ధి దారుల పేరిట పట్టాలు జారీ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో క లెక్టర్ లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. తమ భూములు తమకు దక్కడంతో లబ్ధిదారులు కలెక్టర్, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. సమస్య పరిష్కారంలో చొరవ చూపిన ఆర్డీవో స్రవంతి, ఆదిలాబాద్ రూరల్, సిరికొండ తహసీల్దార్లు గోవింద్ నాయక్, తుకారాంను కలెక్టర్ అభినందించారు. అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి తదితరులున్నారు.
పేదలకు అండగా అఽధికార యంత్రాంగం
కై లాస్‌నగర్(బేల): పేదలకు అధికార యంత్రాంగం అండగా నిలుస్తుందని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. శుక్రవారం బేల మండలంలోని భవానీగూడకు చేరుకున్న కలెక్టర్‌కు మహిళలు పూలు చల్లుతూ ఘనస్వాగతం పలికారు. జిల్లా అధికారుల సంఘం ఆధ్వర్యంలో గ్రామస్తులకు కలెక్టర్ దుప్పట్లు పంపి ణీ చేశారు. జిల్లాలో చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందున పేదలకు దుప్పట్లు పంపిణీ చేసినట్లు చెప్పా రు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్‌రావు, తహసీల్దార్ రఘునాథ్‌రావు, ఎంపీడీవో ఆంజనేయులు, సర్పంచ్ సునీత తదితరులున్నారు.
ఆర్వో ప్లాంట్ ప్రారంభం
మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఆరోగ్యపాఠశాల కార్యక్రమానికి కలెక్టర్ రాజర్షి షా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ.. దాతల సహకారంతో రూ.3 లక్షలతో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్‌ను ప్రారంభించారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటా రు. సీఎం కప్ క్రీడా జ్యోతి ర్యాలీలో పాల్గొన్నారు. పాఠశాలలోని కిచెన్‌షెడ్, ఆరోగ్య పాఠశాల లక్ష్యాలను చాటేలా గోడలపై రాయించిన వాల్ పెయింటింగ్‌ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయ న వెంట హెచ్‌ఎం కృష్ణకుమార్, సర్పంచ్ భాగ్యలక్ష్మి, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.


