‘సీనియర్ టీచర్లకు టెట్ వద్దు’
ఆదిలాబాద్‌టౌన్: సీనియర్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఎస్టీయూటీఎస్ రాష్ట్ర ఉ పాధ్యక్షుడు బెజ్జంకి రవీంద్ర డిమాండ్ చేశారు. అఖి ల భారత ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ పిలుపు మేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలోని కొలిపుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మ ధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2010 ఆగస్టు 23కు ముందు నియమితులైన ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు ఉందని నోటిఫికేషన్‌లో పేర్కొ న్న ఎన్‌సీటీఈ ఈ విషయాన్ని సుప్రీం కోర్టుకు స్ప ష్టంగా తెలియజేయడంలో విఫలమైందని ఆరోపించారు. సుప్రీం కోర్టు తీర్పు వచ్చి నాలుగు నెలలైనా కేంద్ర ప్రభుత్వం లేదా ఎన్‌సీటీఈ స్పందించకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. విద్యాహక్కు చట్టం అమలు తేదీకి ముందు నియమితులై న ఉపాధ్యాయులు రెండేళ్లలో టెట్ ఉత్తీర్ణులు కావా లన్న సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని డిమాండ్ చేశారు. ఏఐజాక్టో ఆధ్వర్యంలో ఫిబ్రవరి 5న ఢిల్లీలో నిర్వహించనున్న పార్లమెంట్ మా ర్చ్ నిరసనను విజయవంతం చేయాలని పిలుపుని చ్చారు. ఎస్టీయూ అర్బన్ మండలాధ్యక్షుడు బేతం పోచారెడ్డి, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, హె చ్‌ఎం నయ్యర్ జాన్‌ఆరా బేగం, ఎస్టీయూ నాయకు లు మురళి, శేఖర్, సంజీవరావు, భీంరావు, దిల్షాద్ రుబీనా, పాండురంగ, మాధవి తదితరులున్నారు.


