ప్రకృతి ఒడిలో ‘సదల్‌పూర్‌’ | - | Sakshi
Sakshi News home page

ప్రకృతి ఒడిలో ‘సదల్‌పూర్‌’

Jan 11 2026 7:31 AM | Updated on Jan 11 2026 7:31 AM

ప్రకృతి ఒడిలో ‘సదల్‌పూర్‌’

ప్రకృతి ఒడిలో ‘సదల్‌పూర్‌’

బేల మండలంలోని సదల్‌పూర్‌ గ్రామంలో గల అటవీ ప్రాంతంలో ప్రసిద్ధ మహాదేవ్‌ భైరాందేవ్‌ ఆలయం ఉంది. దశాబ్దాల క్రితం ఈ ఆలయాన్ని రాక్షసులు రాత్రికిరాత్రే నిర్మించినట్లుగా చెబుతుంటారు. ఇక్కడ ఏటా పుష్యమాసం నవమి రోజున జాతర మొదలవుతోంది. కొరంగే వంశీయులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ నెల 13 నుంచి ప్రారంభమమై19 వరకు కొనసాగనుంది. జిల్లాలోని ఆదివాసీలతో పాటు మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, ఒడిస్సా, కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివస్తుంటారు. ఈ ఆలయం జిల్లా కేంద్రం నుంచి 42 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బేలవరకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది. అక్కడి నుంచి 7 కిలోమీటర్లు ప్రైవేట్‌ వాహనాల ద్వారా చేరుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement