‘పుణ్య’ పూజలకు కేరాఫ్.. పెన్‌గంగ
మహారాష్ట్ర–తెలంగాణ సరిహద్దులోని డొలార(తెలంగాణ)– పిప్పల్‌కోటి(మహారాష్ట్ర) పెన్‌గంగ వద్ద ఏటా పుష్యమాసంలో పెన్‌గంగ జాతర నిర్వహిస్తారు. మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లా పాఠన్‌బోరి గ్రామానికి చెందిన ఆధ్యాత్మిక గురువులు రామానంద్, మాధవ్‌రావుల పుణ్యతిథి పురస్కరించుకుని నిర్వహించే జాతరకు రెండు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివస్తారు. పాఠన్‌బోరి నుంచి ఆ గురువుల పాదుకలను పెన్‌గంగ తీరంలో గల ఆలయం వద్దకు తీసుకువస్తారు. ప్రత్యేక పూజలు అనంతరం రథోత్సవం చేపడుతారు. ఈ నెల 5న ప్రారంభమైన జాతర మరో రెండు రోజుల పాటు కొనసాగనుంది. భక్తులు నదిమాతల్లికి ప్రత్యేక పూజలు చేస్తారు. నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. ప్రస్తుతం నదికి ఈ ప్రాంతంలో భక్తజన సందడి కనిపిస్తోంది.


