రోజు ఒకరింట్లో పిండి వంటలు
మేము ముగ్గురం మంచి స్నేహితులం. ఏ పండుగనైనా మా కుటుంబాలతో కలిసి జరుపుకుంటాం. రెండు మూడు రోజుల నుంచి రోజూ ఒక్కరి ఇంటి వద్ద పిండి వంటకాలు తయారు చేస్తున్నాం. దాదాపు పూర్తయినట్లే. పండుగ పూర్తయ్యే వరకు పిల్లలు, పెద్దలంతా సందడి చేస్తూ సంతోషంగా గడుపుతాం.
– సుమలత, మమత, యామిని,
శాంతినగర్ కాలనీ
మూడు రోజులైతంది..
ఇంట్లో మూడు రోజులుగా పిండి వంటలు తయారు చేస్తున్నాం. పిల్లలు ఇంట్లో చేసినవే ఇష్టంగా తింటారు. పెద్ద మొత్తంలో వంటకాలు చేయాల్సి ఉండడంతో కాలనీలోని మహిళలందరం కలిసి ఒకరికొకరు సాయం చేసుకుంటాం.
– ముదికొండ కల్పన, తిర్పెల్లి
రోజు ఒకరింట్లో పిండి వంటలు


