చుట్టుపక్కల వారందరితో కలిసి..
ఉద్యోగ బాధ్యతలతో పాటు పిల్లలకు రుచికరమైన పిండి వంటలు చే యాల్సిందే. సాయంత్రం వేళలో మా స్నేహితురాళ్లతో కలిసి సకినాలు, గారెలు, అరిసెలు, లడ్డూలు, గవ్వలు, ముర్కులు తయారు చేశాం. సంక్రాంతి పండగొచ్చిందంటే వా రం పది రోజులు ఇళ్లంతా సందడిగా ఉంటుంది. – భాగ్యలక్ష్మి,
మున్సిపల్ ఉద్యోగి, బ్రాహ్మణవాడ
సకినాలు ప్రత్యేకం
సంక్రాంతి అంటేనే పిండివంటలు. నానబెట్టిన బియ్యం పిండితో సకినాలు చేస్తాం. అలాగే అరిసెలు, గారెలు, లడ్డూలు, ఇలా పిల్లలకు ఇష్టమైన అనేక రకాలను ఇంటిళ్లిపాది కలిసి తయారు చేస్తాం. పండుగ రోజు ఆనందంగా గడుపుతాం.
– సరిత, రవీంద్రనగర్
చుట్టుపక్కల వారందరితో కలిసి..


