
నాన్న కోరిక నెరవేర్చా..
– యనకి మధుకృష్ణ, ఎస్‌హెచ్‌వో, గుడిహత్నూర్
కుటుంబనేపథ్యం: మాది ఆర్మూర్. అమ్మ సరస్వతి గృహిణి. నాన్న ఉదయాద్రి కాంట్రాక్టర్. తమ్ముడు మనోన్ చదువుతున్నాడు. చెల్లి వివాహం అయ్యింది.
విద్యాభ్యాసం: ఇంటర్‌వరకు ఆర్మూర్‌లోనే సాగింది. బీటెక్ హైదరాబాద్‌లో పూర్తయింది.
లక్ష్యసాధన: ప్రభుత్వ ఉద్యోగం సాధించాలేది నాన్న కోరిక. అది తీర్చడమే నా కర్తవ్యంగా భావించా. బీటెక్ పూర్తికాగానే ప్రిపరేషన్ మొదలుపెట్టా. మొదట బీట్ ఆఫీసర్‌గా ఉద్యోగం వచ్చింది. 2019 నుంచి 2023 వరకు ఉద్యోగం చేస్తూనే ఎస్సైకి ప్రిపరేషన్ అయ్యా. విజయం సాధించా.
సమాజంలో మీరు కోరుకుంటున్న మార్పు: మానవుడు సంఘ జీవి. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉండా లి. లా అండ్ ఆర్డర్ పాటించాలి.
నిరుద్యోగులకు మీరిచ్చే సూచన..: లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందు సాగితే తప్పకుండా విజయం వరిస్తుంది.