
రెండో ప్రయత్నంలో విజయం
కష్టాలను దిగమింగుతూ ఒకరు.. కన్నీళ్లు కనిపించకుండా మరొకరు.. అందరిదీ ఒకే లక్ష్యం.. యూనిఫామ్ జాబ్. పరిస్థితులు ఎలా ఉన్నా తమకు అనుకూలంగా మార్చుకున్నారు.. పుస్తకాలతో కుస్తీ పట్టి.. మైదానంలో చెమటోడ్చారు.. ప్రతీ క్షణం అదే ధ్యాసలో ఉండి కొలువు కోసం ఓ యజ్ఞమే చేశారు. విజయ తీరాలకు చేరువై కల సాకారం చేసుకున్నారు. వారే జిల్లాలో ఇటీవల విధుల్లో చేరిన ప్రొబేషనరీ ఎస్సైలు. ఎస్‌హెచ్‌వోలుగా బాధ్యతలు నిర్వహిస్తున్న వారి మనోగతం ‘సాక్షి’తో పంచుకున్నారు ఇలా..
ఆదిలాబాద్‌టౌన్/తాంసి/ఇచ్చోడ/బజార్‌హత్నూర్/
ఆదిలాబాద్‌రూరల్/సిరికొండ/గుడిహత్నూర్/
ఉట్నూర్‌రూరల్/నార్నూర్
– బోడ పీర్‌సింగ్‌నాయక్, ఎస్‌హెచ్‌వో, భీంపూర్
కుటుంబ నేపథ్యం..: మాది వ్యవసాయ కుటుంబం. సొంతూరు నిజామాబాద్ జిల్లాలోని మోపాల్. అమ్మానాన్న లక్ష్మీబాయి–రాయిచంద్. వ్యవసాయంలో వాళ్ల కష్టాన్ని దగ్గరిగా చూశా. ఎలాగైనా సర్కారు కొలువు సాధించాలనుకున్నా.
విద్యాభ్యాసం : ఇంటర్ వరకు నిజామాబాద్‌లోనే సాగింది. కరీంనగర్‌లో బీటెక్ పూర్తి చేశా.
లక్ష్య సాధన..: నాకు చిన్నప్పటి నుంచి పోలీస్ యూనిఫాం ధరించాలనే ఫ్యాషన్ ఉండేది. ఆ దిశగా లక్ష్యాన్ని ఏర్పర్చుకుని ప్రిపేర్ అయ్యా. మొదటి ప్రయత్నంలో తృటిలో తప్పింది. నిరాశ చెందలే. మళ్లీ సన్నద్ధమయ్యా. రెండో ప్రయత్నంలో కొలువు
సాధించా.
సమాజంలో మీరు కోరుకునే మార్పు.. : అందులో మీ పాత్ర: అందరికీ సమన్యాయం జరగాలి. పేద, ధనిక తేడాలుండొద్దు. అలాంటి మార్పు కోసం నావంతు కృషి చేస్తా.
నిరుద్యోగులకు మీరిచ్చే సూచన..: లక్ష్యసాధనకు లాంగ్‌టర్మ్ ప్రిపరేషన్ దోహదపడుతుంది. అపజయాలు ఎదురైనా కుంగిపోవద్దు. పట్టుదల వీడకుండా కష్టపడితే
విజయం వరించడం ఖాయం.