
బారులు తీరి.. సమస్యలు నివేదించి
● ప్రజావాణికి 107 దరఖాస్తులు ● అర్జీలు స్వీకరించిన కలెక్టర్
కైలాస్‌నగర్: ప్రజాసమస్యల పరిష్కారం కోసం కలె క్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌కు అర్జీదారులు బారులు తీరారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన వారంతా కలెక్టర్ రాజర్షి షాకు తమ గోడు విన్నవించి దరఖాస్తులు అందజేశారు. వాటిని కలెక్టర్ సంబంధిత అధికారులకు అందజేస్తూ పరిష్కరించేలా చూడాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉంచొద్దని సూచించారు. ఇందులో అదనపు కలెక్టర్ శ్యామలా దేవి, ఆర్డీవో వినోద్‌కుమార్‌తోపాటు ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ వారం మొత్తం 107 అర్జీలు అందాయి. ఇందులో భూ సమస్యలు, పింఛన్, విద్య, వైద్యం, వ్యవసాయం, విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు వంటి సమస్యలే అధికంగా ఉన్నాయి. కాగా, ఈ వారం వచ్చిన దరఖాస్తుదారుల్లో కొందరి నివేదన వారి మాటల్లోనే..