
అకాల వర్షం.. ఆగమాగం
● విరిగిపడ్డ విద్యుత్ స్తంభాలు ● తడిసిన వరి ధాన్యం, జొన్నలు ● రైతులకు తీవ్ర ఇబ్బందులు
ఆదిలాబాద్‌టౌన్/ఇంద్రవెల్లి/జైనథ్/తాంసి/ఉట్నూర్‌రూరల్: జిల్లాలో పలు మండలాల్లో శుక్రవారం రాత్రి అకాల వర్షం కురిసింది. ఈదురుగాలులు తోడవడంతో పలు చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఇంటిపైకప్పులు ఎగిరిపోయాయి. కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఇబ్బందులకు గురయ్యారు.
జిల్లాలో 12.2 మి.మీ. వర్షం
జిల్లాలో 12.2 మిల్లీ మీటర్ల వర్షం నమోదైంది. సాయంత్రం 6నుంచి రాత్రి 10 గంటల వరకు వర్షం కురిసింది. ఇంద్రవెల్లి ఏరియాలో 28 వి ద్యుత్‌స్తంభాలు పడిపోయాయి. అలాగే ఉట్నూర్‌లో మూడు విద్యుత్ స్తంభాలు నేలకొరగగా మూడు కండక్టర్లు కాలిపోయాయి. విద్యుత్ శాఖ ఎస్‌ఈ జేఆర్ చౌహాన్ ఆయా ప్రాంతాలను పరిశీలించారు. నష్టాన్ని అంచనా వేశారు. అలా గే ఇంద్రవెల్లి, జైనథ్, ఉట్నూర్, బేల, సాత్నాల, ఇచ్చోడ తదితర కొనుగోలు కేంద్రాల్లో విక్రయాలకు తెచ్చిన జొన్న పంట తడిసింది. దీంతో రైతులు వాటిని ఆరబెట్టారు.
● ఇంద్రవెల్లి మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ స్తంభాలపై చెట్లు పడిపోయాయి. క రెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. డీఈ సుభాష్ ఆధ్వర్యంలో సిబ్బంది మరమ్మ తులు చేపట్టారు. మండలంలోని కేస్లాగూడలో వెడ్మ అంబాజీ, ధ ర్మసాగర్‌లో గోతి సర్ధార్, సాబ్లే జైత్రం, సాబ్లే లాల్‌సింగ్, గోతి సైనా బాయి, శ్యామ్‌రావ్, నాథ్‌సింగ్, రాజేందర్‌కు చెందిన ఇళ్ల పైకప్పులుదెబ్బతిన్నాయి. తమ కు పరిహారం అందించి ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.
● జైనథ్, తాంసి మండలకేంద్రాల్లో మార్కెట్ యార్డులకు తీసుకువచ్చిన జొన్నలు వర్షానికి తడిసిపోయాయి. రైతులు టార్పాలిన్లు కప్పినా తడిసిపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు.
● ఉట్నూర్ మండలకేంద్రంలోని గంగన్నపేట వరి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద వర్షానికి ధాన్యం కొంతమేర తడిసింది. విషయం తెలుసుకున్న ఏపీడీ గోవింద్‌రావు అక్కడికి చేరుకొని ధాన్యాన్ని పరిశీలించారు.

అకాల వర్షం.. ఆగమాగం

అకాల వర్షం.. ఆగమాగం

అకాల వర్షం.. ఆగమాగం