
అర్జీలు సత్వరమే పరిష్కరించాలి
కైలాస్‌నగర్: పైలెట్ ప్రజావాణిలో అందించే అర్జీలు సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ రాజ ర్షి షా అన్నారు. ఉట్నూర్, ఇంద్రవెల్లి, తలమడుగు, జైనథ్ మండలాల జేఆర్‌వోలు, జిల్లాస్థాయి, ప్రత్యేక అధికారులు, గ్యాస్ డీలర్లతో పైలెట్ ప్రజావాణి అమలుపై సమీక్ష నిర్వహించారు. అందుతున్న అర్జీలు, పరిష్కారానికి చేపట్టిన చర్యలపై మండలాల వారీగా సమీ క్షించారు. గ్యాస్ సబ్సిడీ, రుణమాఫీ, పింఛన్, గృహజ్యోతి అంశాలపైనే అధిక ఫిర్యాదులు అందుతున్నట్లుగా సంబంధిత అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేస్తూ బాధితుల సమస్యలు సత్వరం పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. సమావేశంలో ఆర్డీవో వినోద్‌కుమార్, జెడ్పీ సీఈవో జితేందర్ రెడ్డి, డీఆర్డీవో రాథోడ్ రవీందర్, డీఎస్‌వో వాజీద్‌అలీ పాల్గొన్నారు.
ఈవీఎంల గోదాం పరిశీలన
జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌లో గల ఈవీ ఎంలను భద్రపర్చిన గోడౌన్‌ను కలెక్టర్ రాజర్షి షా శనివారం సందర్శించారు. నెలవారి సందర్శనలో భాగంగా స్ట్రాంగ్‌రూంలోని ఈవీఎంలను పరిశీలించారు. భద్రత సిబ్బందితో మా ట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయ న వెంట అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, కలెక్టరేట్ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ రాథోడ్ పంచపూల తదితరులున్నారు.