
గడువు పెంచినా గగనమే!
● ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లింపుపై అనాసక్తి ● ఇప్పటికే మూడుసార్లు గడువు పెంపు ● రాయితీ ప్రకటించినా స్పందన కరువు
కై లాస్‌నగర్: అక్రమ లేఅవుట్లలోని ప్లాట్ల క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌ఎస్)కు రాష్ట్ర ప్రభుత్వం మ రో అవకాశం కల్పించింది. ఎల్‌ఆర్‌ఎస్–2020 స్కీం కింద 25శాతం రాయితీ ప్రకటించింది. ఫీ జు చెల్లింపు గడువు ఇప్పటికే మూడుసార్లు పొడిగించింది. అయినా ఆశించిన స్థాయిలో ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించేందుకు దరఖాస్తుదారులు ముందుకు రావడం లేదు. దీంతో క్రమబద్దీకరణ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఫీజు చెల్లింపునకు మరో 15రోజుల గడువు ఉండగా దరఖా స్తుదారుల్లో పెద్దగా స్పందన కనిపించడంలేదు.
25శాతం రాయితీతో ఓటీఎస్
ప్లాట్ల క్రమబద్ధీకరణకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2020లో ఎల్‌ఆర్‌ఎస్ పథకాన్ని ప్రకటించింది. రూ.వెయ్యి చెల్లించి మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్నవారి ప్లాట్లు క్రమబద్ధీకరించుకునే అవకాశం కల్పించింది. వేలల్లో దరఖాస్తులు రావడం, వాటి పరిశీలనకు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ వి భాగంలో తగినంత సిబ్బంది లేక ప్రక్రియ మందకొడిగా సాగింది. కాంగ్రెస్ అధికారంలోకి వ చ్చాక ఎల్‌ఆర్‌ఎస్ నిబంధనలు సడలించింది. గ తంలో దరఖాస్తు చేసుకున్న వారితోపాటు అక్ర మ లేఅవుట్లలో 10శాతం ప్లాట్ల రిజిస్ట్రేషన్ పూర్తయితే విక్రయించకుండా ఉన్న ప్లాట్లకూ అవకాశం కల్పించింది. ఫీజులో 25శాతం రాయితీ కల్పిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరిలో వన్‌టైం సెటిల్‌మెంట్ అవకాశం కూడా కల్పించింది.
పదేపదే గడువు పెంచినా..
ఎల్‌ఆర్‌ఎస్‌కు 25శాతం ఫీజు రాయితీ ప్రకటించి న ప్రభుత్వం తొలుత మార్చి 31వ తేదీ వరకు గడువు విధించగా ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. దీంతో మరోసారి ఏప్రిల్ 30వరకు గడు వు పొడిగించింది. అయినా నామమాత్రంగానే స్పందన వచ్చింది. దీంతో ఈ నెల 3వ తేదీ వరకు మళ్లీ గడువు పెంచినా ఆశించిన స్థాయిలో చెల్లింపులు లేవు. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నెల 31వ తేదీ వరకు చెల్లింపు గడువు పెంచుతూ ఈనెల 12న ఉత్తర్వులు జారీ చేసింది.
కారణాలనేకం..
ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లింపుల్లోనూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. పలు ప్లాట్లను నిషేధిత భూముల జాబితాలో చూపడం, వాటిని సరి దిద్దాల్సిన అధికారుల మధ్య సమన్వయం కొరవడటం, ఫీజు చెల్లించినా సకాలంలో ప్రొసీడింగ్‌లు అందించకపోవడం, ఎల్‌ఆర్‌ఎస్‌పై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించకపోవడం లాంటి కారణాలతోనే దరఖాస్తుదారులు ఫీజు చెల్లింపునకు ముందుకు రావడం లేదు. ఫలితంగా ప్రభుత్వ ఖ జానాకు అనుకున్న స్థాయిలో ఆదాయం రాలేదు. ఇప్పటివరకు ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారుల ఫీజు చెల్లింపు ద్వారా ఆదిలాబాద్ మున్సిపాలిటీకి రూ.7.60 కోట్ల ఆదాయమే సమకూరింది.
పరిశీలనలోనూ జాప్యం
రెవెన్యూ, నీటి పారుదల, మున్సిపల్ శాఖల అధి కారులు, సిబ్బంది వివిధ దశల్లో ప్లాట్లను పరిశీ లించి నిబంధనల మేరకు చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. చెరువు శిఖం, బఫర్ జోన్లను నీటి పారుదల శాఖాధికారులు గుర్తించాల్సి ఉండగా ప్రభు త్వ, అసైన్డ్ ఇతర వివాదాస్పద భూములను రెవె న్యూ సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించి మున్సి పల్ అధికారులకు వివరాలు అందించాల్సి ఉంది. వాటిపై ఎలాంటి అభ్యంతరాలు లేవని ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు నివేదిక ఇచ్చిన తర్వాత బల్దియా అధికారులు క్రమబద్ధీకరణ ప్రొసీడింగ్స్ ఇస్తున్నారు. ఆయా శాఖల అధికారులు, సిబ్బంది తమ పనుల్లో నిమగ్నమవడం, ఎల్‌ఆర్‌ఎస్ ప్లాట్ల పరిశీలనలో జాప్యం చేస్తుండటం కూడా క్రమబద్ధీకరణ ప్రక్రియపై ప్రభావం చూపుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మున్సిపల్ పరిధిలోని వార్డులు : 49
ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు : 22,489
ఫీజు చెల్లించినవారు: 4,369
జారీ చేసిన ప్రోసిడింగ్‌లు: 2,015
ఫీజు రాయితీని సద్వినియోగం చేసుకోవాలి
25శాతం ఫీజు రాయితీతో ప్లాట్లు క్రమబద్ధీ కరించుకునే గడువు ప్రభుత్వం ఈ నెల 31 వరకు పొడిగించింది. ప్లాట్లు క్రమబద్ధీకరించుకుంటే భవన నిర్మాణాలకు అనుమతులు పొందవచ్చు. ప్రక్రియపై దరఖాస్తుదారుల కు ఎలాంటి సందేహాలున్నా కార్యాలయంలో సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చు. దరఖాస్తుదారులు ఈ అవకాశాన్ని సద్వినియో గం చేసుకోవాలి. – సుమలత,
టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, ఆదిలాబాద్