
అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం●
● డీఎస్పీ జీవన్‌రెడ్డి
ఆదిలాబాద్‌టౌన్: అసాంఘిక కార్యకలాపాల పై ఉక్కుపాదం మోపుతామని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని వడ్డెర కాలనీలో ఆదివారం కమ్యూనిటీ కాంటాక్ట్ కమ్ కార్డెన్‌సెర్చ్ నిర్వహించారు. ఇళ్లలో సోదాలు చేపట్టారు. కాలనీకి చెందిన ఒల్లెపు బాబన్న బైక్ నంబర్ మార్ఫింగ్ చేసి మరో నంబర్ బిగించినట్లు గుర్తించారు. ఆయనపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కాలనీకి చెందిన దారంగుల గంగమ్మ ఇంట్లో సోదాలు చేయగా 17దేశీదారు బాటిళ్లతో పా టు ఒక బీర్ లభించినట్లు పేర్కొన్నారు. ఆమె పై కూడా కేసు నమోదు చేసినట్లు వివరించారు. స్క్రాప్ యజమానులు దొంగతనం చేసిన వస్తువులను కొనుగోలు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రెండు రోజుల పాటు ఆదిలాబాద్ సబ్ డివిజన్ పరిధిలోని స్క్రాప్ దుకాణాలను తనిఖీ చేయగా, సర్వీస్ వైర్లు, అగ్రికల్చర్‌కు సంబంధించిన సబ్‌మెర్సిబుల్ మో టార్లు, కాపర్ తీగలు కొనుగోలు చేసినట్లు తేలిందన్నారు. తొ మ్మిది మందిపై కేసులు నమోదు చేసినట్లు వివరించారు. ఎవరైనా కాపర్‌వైర్లు, ఇతర వస్తువులు అమ్మడానికి వస్తే వారి వివరాలు, ఫోన్ నంబర్లు నమోదు చేయాలని సూచించారు. అలాగే దుకాణాల్లో సీసీ కెమెరాలు బిగించుకోవాలన్నారు. డీఎస్పీ వెంట టూ టౌన్ ఎస్సైలు తిరుపతి, విష్ణుప్రకాశ్, హెడ్‌కానిస్టేబుల్ బబిత తదితరులున్నారు.