
కలెక్టర్‌కు సన్మానం
కై లాస్‌నగర్: ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా అవార్డు అందుకున్న కలెక్టర్ రాజర్షి షాను గురువారం దళిత సంఘాల ఆధ్వర్యంలో సన్మానించారు. కలెక్టరేట్ సమావేశ మందిరం వద్ద శాలువా తో సత్కరించారు. జ్ఞాపిక అందజేసి అభినందనలు తెలిపారు. వారు మాట్లాడుతూ.. మరిన్ని అవార్డులు అందుకోవాలని ఆకాక్షించారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు రమేశ్, ప్రజ్ఞాకుమార్, మల్లన్న, బాలశంకర్ కృష్ణ, శశికాంత్, రాఘవేంద్ర, లలిత, కానిందేబాయి తదితరులు పాల్గొన్నారు.
ఇంటర్ పరీక్షలు ప్రారంభం
ఆదిలాబాద్‌టౌన్: ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 16 పరీక్షాకేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉ దయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ఫస్టియర్, 2.30నుంచి సాయంత్రం 5.30గంటల వరకు సెకండియర్ పరీక్షలు నిర్వహించారు. నిమిషం ని బంధన ఉండగా విద్యార్థులు నిర్ణీత సమయానికంటే ముందే కేంద్రాలకు చేరుకున్నారు. ఫస్టియర్‌లో 1,823మందికి 1,716 మంది హాజరు కాగా 107 మంది గైర్హాజరయ్యారు. సెకండియర్‌లో 588 మందికి 531మంది హాజరుకాగా, 57మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఐఈవో జాదవ్ గణేశ్ తెలిపారు.
డిగ్రీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్?
ఉట్నూర్‌రూరల్: ప్రస్తుతం కొనసాగుతున్న డిగ్రీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరుగుతున్నట్లు తెలు స్తోంది. ఉట్నూర్ పట్టణంలోని హోటళ్లు, మూత్రశాలలు, బస్టాండ్ ప్రాంతం, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ల వద్ద మైక్రో జిరాక్స్ చిట్టీలు విచ్చలవిడిగా కనిపించ డమే దీనికి నిదర్శనం. ఇన్విజిలేటర్లు, నిర్వాహకులు కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు న్నాయి. జిరాక్స్ సెంటర్ల నిర్వాహకులు పరీక్షలకు అనుగుణంగా మైక్రోజిరాక్స్ చీటీలు తయారు చేసి అందుబాటులో ఉంచినటు తెలిసింది. వీటిని విద్యార్థులకు విక్రయించినట్లు సమాచారం.