‘కాంగ్రెస్‌ బలోపేతానికి కృషి’ | - | Sakshi
Sakshi News home page

‘కాంగ్రెస్‌ బలోపేతానికి కృషి’

May 23 2025 2:21 AM | Updated on May 23 2025 2:21 AM

‘కాంగ్రెస్‌ బలోపేతానికి కృషి’

‘కాంగ్రెస్‌ బలోపేతానికి కృషి’

ఆదిలాబాద్‌ రూరల్‌: క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతా నికి కృషి చేస్తున్నట్లు టీపీసీసీ ఉపాధ్యక్షుడు, పార్టీ జిల్లా పరిశీలకుడు, ఉర్దూ అకాడమీ చైర్మన్‌ తాహెర్‌ బిన్‌ హందన్‌ పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడేవారికే పదవులు దక్కుతాయని తెలిపారు. గురువా రం మండలంలోని యాపల్‌గూడలో కాంగ్రెస్‌ ఆది లాబాద్‌ రూరల్‌, సాత్నాల, మావల మండలాల వి స్తృత స్థాయి సమావేశం నిర్వహించగా హాజరై మా ట్లాడారు. పార్టీ ఆదేశానుసారం ప్రతి ఒక్కరూ పని చేయాలని సూచించారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ మాట్లాడుతూ.. జిల్లాలో పార్టీని పటిష్టం చేసేందుకే సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించడమే లక్ష్యంగా ప్రతీ నాయకుడు, కార్యకర్త పని చేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు గ్రామంలోని కుమురంభీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆది లాబాద్‌ అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డి, డీసీ సీబీ చైర్మన్‌ అడ్డి భోజారెడ్డి, నాయకులు బోరంచు శ్రీకాంత్‌రెడ్డి, సుధాకర్‌గౌడ్‌, గిమ్మ సంతోష్‌, భూపె ల్లి శ్రీధర్‌, సాంటెన్న, ఎల్టి భోజారెడ్డి పాల్గొన్నారు.

మున్సిపల్‌ ఎన్నికల్లో సత్తా చాటాలి

కైలాస్‌నగర్‌: రానున్న మున్సిపల్‌ ఎన్నికల్లో సత్తా చాటాలని, ఇందుకు పార్టీ కార్యకర్తలంతా సమష్టి కృషి చేయాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, ఉర్దూ అకా డమీ చైర్మన్‌ తాహెర్‌ బిన్‌ హందన్‌ సూచించారు. జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించిన కాంగ్రెస్‌ ఆదిలాబాద్‌ పట్టణ విస్తృతస్థాయి సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. బూత్‌ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేసేందుకు సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ఎవరికి పార్టీ అ ధ్యక్ష పదవి ఇచ్చినా అంతా కలిసి పార్టీ కోసం పనిచేస్తామని తెలిపారు. ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ దాదాపు రూ.388 కోట్ల విలువైన భూకబ్జాలకు పాల్పడినట్లు ఆరోపించారు. అవినీతికి పాల్ప డేవారిని తాను ప్రశ్నిస్తానని చెప్పారు. పార్టీ పరిశీలకుడు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారా యణ, మాజీ ఎంపీ సోయం బాపూరావు, డీసీసీబీ చైర్మన్‌ అడ్డి భోజారెడ్డి, బోరంచు శ్రీకాంత్‌రెడ్డి, దిగంబర్‌రావు పాటిల్‌, బాలూరి గోవర్ధన్‌రెడ్డి, మునిగెల నర్సింగ్‌, ముజాహిదీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement