సాగుపై అవగాహన ఉండాలి
నార్నూర్: రైతులు పంటల సాగుపై అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. గురువారం నాబార్డ్ ఆధ్వర్యంలో ఎన్‌ఆర్‌ఎన్‌ఆర్ భూ సంపదపై మండల కేంద్రంలోని జిన్నింగ్ మిల్లులో నిర్వహించిన సమావేశానికి హాజరయ్యారు. జిన్నింగ్ మిల్లును పరిశీలించారు. నా బార్డ్, దాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఎన్‌ఆర్‌ఎన్‌ఆర్ భూసంపద కేంద్రం పనితీరు తె లుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నాబార్డు, దాన్ ఫౌండేషన్ పనితీరు బాగుందని తెలిపారు. రైతు సభ్యుల సంఖ్య పెంచి మరింత మందికి న్యాయం చేయాలని సూచించారు. ఈ నెల 31 వరకు జొన్నలు కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. కాగా, రైతుల కోరిక మేరకు మరో 10రోజులు పొడిగించేందుకు సా నుకూలంగా స్పందించారు. అనంతరం మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాన్ని పరిశీ లించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలని సూచించారు. సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్, డీఏవో శ్రీధర్‌స్వామి, నాబార్డ్ డీడీఎం అబ్దుల్ రవూఫ్, దాన్ ఫౌండేషన్ ప్రతినిధి నీలేశ్ రాథోడ్, మండల విద్యాధికారి పవార్ అనిత తదితరులున్నారు.


