● పాలకులను కదిలించిన కథనాలు ● ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ ● ‘ఎయిర్‌పోర్ట్‌, వర్సిటీ ’ డిబేట్లకు అనూహ్య స్పందన | - | Sakshi
Sakshi News home page

● పాలకులను కదిలించిన కథనాలు ● ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ ● ‘ఎయిర్‌పోర్ట్‌, వర్సిటీ ’ డిబేట్లకు అనూహ్య స్పందన

Dec 29 2025 7:52 AM | Updated on Dec 29 2025 7:52 AM

● పాల

● పాలకులను కదిలించిన కథనాలు ● ప్రజా సమస్యల పరిష్కారానిక

● పాలకులను కదిలించిన కథనాలు ● ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ ● ‘ఎయిర్‌పోర్ట్‌, వర్సిటీ ’ డిబేట్లకు అనూహ్య స్పందన ● దశాబ్దాలుగా జిల్లావాసుల చిరకాల స్వప్నం అయిన ఎయిర్‌పోర్టు సాధనపై ‘సాక్షి’ ఆధ్వర్యంలో డిబెట్‌ నిర్వహించడం జరిగింది. ‘ఆశలకు రెక్కలు’శీర్షికన ప్రచురితమైన కథనం అందరినీ ఆలోచింపజేసింది. అనంతరం ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు దీనిపై సానుకూలంగా స్పందించారు. ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ అసెంబ్లీలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఎంపీ నగేశ్‌ పార్లమెంట్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఫలితంగా ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్‌ లభించింది. ఇటీవల సీఎం రేవంత్‌ రెడ్డి జిల్లా పర్యటనలో దీనిపై స్పష్టత ఇచ్చారు. భూసేకరణ చేపట్టాలని కలెక్టర్‌ను ఆదేశించారు. రెండు రోజుల క్రితం జిల్లాకు వచ్చిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఎయిర్‌పోర్టు స్థలాన్ని పరిశీలించారు. ● జిల్లాలో యూనివర్సిటీ ఆవశ్యకతపై కూడా ‘సాక్షి’ చర్చా వేదిక నిర్వహించింది. అందులోనే వర్సిటీ సాధన సమితి ఏర్పడింది. ఈ సమితి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలతో పాటు గ్రంథాలయాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఇటీవల జిల్లాకు వచ్చిన సీఎం రేవంత్‌ రెడ్డి యూనివర్సిటీపై స్పందించారు. జిల్లాలోని ఇంద్రవెల్లిలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని సుముఖత వ్యక్తం చేశారు. ● ‘నిరుద్యోగులకు ఎర’ శీర్షికన కథనం ప్రచురితమైన కథనానికి సదరు కిలేడీ ఆ డబ్బులను తిరిగి నిరుద్యోగులకు ఇచ్చేశారు. ● వైద్యారోగ్య శాఖలో అక్రమ డిప్యూటేషన్లపై ప్రచురితమైన జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి స్పందించారు. ల్యాబ్‌ టెక్నీషియన్ల డిప్యూటేషన్లు రద్దు చేశారు. ● అర్హతకు మించి వైద్యం..శీర్షికన ప్రచురితమైన కథనానికి వైద్యారోగ్య శాఖాధికారులు స్పందించారు. ఆర్‌ఎంపీ, పీఎంపీ క్లినిక్‌లను మూసివేయించారు. ● ‘ప్రాణాలు తీస్తున్న క్వారీలు.. తవ్వేస్తున్నారు..’ శీర్షికన ప్రచురితమైన కథనాలకు అటవీ శాఖాధికారులు స్పందించారు. జిల్లాలోని 9 రేంజ్‌ల పరిధిలోని క్వారీల నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. ● ‘వీళ్లింతే.. మారరంతే..’ శీర్షికన ప్రచురితమైన క థనానికి కలెక్టర్‌ రాజర్షిషా స్పందించారు. వైద్యులు సమయపాలన పాటించకపోవడం, మధ్యాహ్నం తర్వాత గైర్హాజరు ఉండడంతో రిమ్స్‌ డైరెక్టర్‌ను వివరణ కోరారు. సమయపాలన పాటించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ● ‘ప్రయాణ కష్టాలు..’ శీర్షికన ప్రచురితమైన కథనానికి ఆర్టీసీ అధికారులు స్పందించారు. ఉట్నూర్‌ నుంచి నిర్మల్‌, నిజామాబాద్‌ జిల్లాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి జనం ఇబ్బందులను తొలగించారు. ● ‘108లో మహిళ ప్రసవం.. శిశువు మృతి..’ శీర్షికన ప్రచురిమైన కథనానిఇక జిల్లా కలెక్టర్‌ స్పందించి నివేదిక సమర్పించాలని వైద్యాధికారి కృష్ణను ఆదేశించారు. ఆ వివరాలను సేకరించారు. ● ‘స్వచ్ఛతలో పూర్‌..’ అనే కథనం ప్రచురితం కాగా, మున్సిపల్‌ అధికారుల తీరుపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ర్యాంక్‌ వెనుకబటానికి కారణాలపై ఆరా తీశారు. ● ‘శ్రీనిధి స్వాహా..’ శ్రీనిధికి సంబంధించిన రూ.13లక్షల నిధులు స్వాహా చేయడంపై కథనం ప్రచురితమైంది. అక్రమార్కులపై కలెక్టర్‌ సీరియస్‌ అయ్యారు. నివేదిక అందజేయాలని ఆదేశించారు. ● ‘మొక్కలు తెప్పించారు.. పంపిణీ మరిచారు..’ కథనానికి కలెక్టర్‌ స్పందించారు. బల్దియా ఇంజనీర్‌ వేతనంలో కోత విధించారు. ● రిజిస్ట్రేషన్ల దందా.. శీర్షికన ప్రచురితమైన కథనానికి గాను ఆదిలాబాద్‌ సబ్‌ రిజిస్ట్రార్‌కు మెమో జారీ చేశారు. ● రిమ్స్‌లోని చిల్డ్రన్స్‌ వార్డులో ఒక్కో బెడ్‌పై ఇద్దరికి వైద్యం చేయడంతో పడకేసిన సౌకర్యాలు అనే కథనం ప్రచురితమైంది. రిమ్స్‌ డైరెక్టర్‌ స్పందించి పిల్లలకు ప్రత్యేక గది ఏర్పాటు చేశారు. ● ‘ఆదుకోండి.. ఆసరా ఇవ్వండి..’ శీర్షికన కథనం ప్రచురితం కాగా, సామాజిక కార్యకర్త స్పందించి చిన్నారికి సైకిల్‌ పంపిణీ చేశారు.

ప్రత్యేక డిబేట్లు..

మరికొన్ని ప్రత్యేక కథనాలు..

ప్రజా సమస్యల పరిష్కారం కోసం ‘సాక్షి’ సామాజిక బాధ్యతగా ముందడుగు వేస్తోంది. జనం గొంతుకగా నిలుస్తూ వారి ఆకాంక్షలను ప్రతిబింబిస్తోంది. దశాబ్దాల కలలకు ‘అక్షర’ రూపం దాల్చి నెరవేర్చే ప్రయత్నం చేస్తోంది. ప్రత్యేక కథనాల ద్వారా సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చొరవ చూపుతోంది. ఈ ఏడాది ఎయిర్‌పోర్ట్‌, యూనివర్సిటీ అంశాలపై చేపట్టిన డిబేట్లు అందరినీ ఆలోచింపజేశాయి. సాక్షాత్తు అసెంబ్లీ, పార్లమెంట్‌ వేదికల్లో వీటిపై చర్చ జరగడం గమనార్హం. స్పందించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రాంతవాసుల కలలు సాకరమయ్యేలా చొరవ చూపుతున్నాయి. అలాగే ప్రత్యేక కథనాల ద్వారా అక్రమాలు, అన్యాయాలకు పాల్పడిన వారిపై యంత్రాంగం కొరఢా ఝుళిపించేలా బాధితులకు అండగా నిలుస్తోంది. ఇందులో భాగంగా పలు అంశాలపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించి నిబంధనలు అతిక్రమించిన ఉద్యోగులు, అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. పలువురు సస్పెన్షన్‌కు గురికాగా, మరికొందరికి మెమోలు, వేతనాల్లో కోత విధించారు. మొరం, ఇసుక తవ్వకాలకు అడ్డుకట్ట వేశారు. ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను మోసగించిన వారిపై పోలీసులు చర్యలు చేపట్టారు. –ఆదిలాబాద్‌టౌన్‌

● పాలకులను కదిలించిన కథనాలు ● ప్రజా సమస్యల పరిష్కారానిక1
1/2

● పాలకులను కదిలించిన కథనాలు ● ప్రజా సమస్యల పరిష్కారానిక

● పాలకులను కదిలించిన కథనాలు ● ప్రజా సమస్యల పరిష్కారానిక2
2/2

● పాలకులను కదిలించిన కథనాలు ● ప్రజా సమస్యల పరిష్కారానిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement