టెట్‌కు హాజరయ్యే టీచర్లకు ఆన్‌డ్యూటీ ఇవ్వాలి
ఆదిలాబాద్‌టౌన్: టెట్‌కు హాజరయ్యే ఉపాధ్యాయులకు ఆన్‌డ్యూటీ సౌకర్యం కల్పించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వలభోజు గోపీకృష్ణ అనా ్నరు. ఆదివారం జిల్లా కేంద్రంలో టీపీయూఎస్ ఆధ్వర్యంలో టెట్‌పై ఉపాధ్యాయులకు శిక్షణ కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా ఉపాధ్యాయులకు 300 కిలో మీటర్ల కంటే ఎక్కువ దూరంలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వం పునరాలోచించి జిల్లా కేంద్రంలోనే పరీక్ష నిర్వహించాలని కోరారు. ఇందులో సంఘం నాయకులు నారాయణ, లస్మన్న, గంభీర్, జయసారధి, రాజేశ్, కృష్ణసాగర్, సతీష్ పాల్గొన్నారు.


