
‘కేంద్ర ప్రభుత్వ విధానం సరికాదు’
ఆదిలాబాద్‌రూరల్: ఆదివాసీలు, మావోయిస్టులను హత్య చేసినట్లు గర్వంగా ప్రకటించుకున్న కేంద్ర ప్ర భుత్వ విధానం సరికాదని వామపక్ష ప్రజాసంఘా ల నాయకులు పేర్కొన్నారు. మావోయిస్టు పార్టీ జా తీయ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతో పా టు పలువురిని ఎన్‌కౌంటర్ పేరిట హత్య చేశారని ఆరోపించారు. గురువారం జిల్లా కేంద్రంలో కళ్లకు నల్లగుడ్డలు కట్టుకుని నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అడవుల్ని కార్పొరేట్లకు అప్పగించే లక్ష్యంతోనే మోదీ సర్కార్ ఆపరేషన్ కగార్ పేరిట హత్యాకాండకు పూనుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. వివిధ ప్రజాసంఘాలు, పార్టీల నాయకులు గోడం గణేశ్, వెట్టి మనోజ్, సిర్ర దేవేందర్, వెంకటనారాయణ, జగన్‌సింగ్, గద్దల శంకర్, మడావి గణేశ్, గేడం కేశవ్, మెస్రం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.