
‘ముందస్తు చర్యలు చేపట్టాం’
కైలాస్‌నగర్: జిల్లాలో కురుస్తున్న అకాల వర్షాలతో జనజీవనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టామని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. వరి ధాన్యం కొనుగోళ్లు, భారీ వర్షాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు గురువారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయ న పాల్గొని మాట్లాడారు. అధికారులను అప్రమత్తం చేశామని తెలిపారు. లోతట్టు ప్రాంతాలు, వాగుల వైపు ఎవరూ వెళ్లకుండా భద్రత చర్యలు చేపట్టినట్లు తెలిపారు. వర్షాల కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తడవకుండా రైతులకు టార్పాలిన్లు సమకూర్చామని తెలిపారు. ఖరీఫ్‌నకు అవసరమైన విత్తనాలు, యూరియా కొరత లేకుండా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ఫర్టిలైజర్ దుకాణాల ను తనిఖీ చేసి నకిలీ, నిషేధిత విత్తనాలు విక్రయించకుండా పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు వి వరించారు. జిల్లాలో టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పా టు చేసి నకిలీ విత్తనాల అక్రమ రవాణా జరగకుండా అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. టెలికాన్ఫరెన్స్‌లో అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో వినోద్‌కుమార్, డీఏవో శ్రీధర్‌స్వామి, సివిల్ సప్లయ్ డీఎం సుధారాణి, డీఎస్వో వాజీద్ అలీ తదితరులు పాల్గొన్నారు.