
● త్వరలో కాంగ్రెస్ కమిటీల ఎంపిక ● ఆధిపత్యం కోసం నేతల ప
సాక్షి, ఆదిలాబాద్: కాంగ్రెస్ బూత్, గ్రామ, మండ ల, బ్లాక్ కమిటీల ఎంపికలో ముఖ్య నేతల మధ్య సమన్వయం కుదురుతుందా?.. సామాజిక న్యా యానికే ప్రాధాన్యత ఉంటుందా?.. లేదా కమిటీల కూర్పులో ముఖ్య నేతలు తమవారికే పదవులు దక్కేలా చక్రం తిప్పుతారా?.. అనే ప్రశ్నలు ప్రస్తు తం జిల్లా పార్టీలో చర్చనీయాంశమయ్యాయి. కాంగ్రెస్ కమిటీల ఏర్పాటుకు ఈనెల 7న జిల్లా విస్తృత స్థాయి సమావేశాన్ని జిల్లా కేంద్రంలో నిర్వహించారు. టీపీసీసీ నుంచి పరిశీలకులుగా వచ్చిన ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్‌బిన్ హందన్, టీపీసీసీ కార్యదర్శి చిట్ల సత్యనారాయణ పాల్గొన్నారు. ఆ తర్వాత మండలాలవారీగా సమావేశాలు నిర్వహించారు. గురువా రం ఆదిలాబాద్ పట్టణ సమావేశాన్ని కూడా పూర్తి చేశారు. ఈ సమావేశాల్లో మండలాల వారీగా ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఒక్కో కమిటీకి మూడు నుంచి నాలుగు పేర్లు తీసుకున్నారు. వారి పేర్లను అధిష్టానానికి పంపనున్నారు. ఈనెల 28వ తేదీ లోపు ఈ కమిటీలను పూర్తి చేయాలని భావిస్తున్నారు.
పరిశీలకులకు సవాలే..
కమిటీల ఏర్పాటుకు సమావేశాలు పూర్తి చేసిన పరి శీలకులకు ఇప్పుడు అసలు సవాల్ మొదలైంది. ప్ర ధానంగా నియోజకవర్గాల్లో ముఖ్య నాయకుల మ ధ్య సమన్వయం సాధించడం ఒక ఎత్తైతే.. సామాజిక న్యాయం పాటించడం మరొక ఎత్తు. ఈ రెండింటిలో ఏ లోపం చోటుచేసుకున్నా పార్టీలో వివాదాలు, నాయకుల మ ధ్య విభేదాలు తప్పవు. ప్ర ధానంగా ఆదిలాబాద్ ని యోజకవర్గంలో ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డి, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్‌రెడ్డి, బోథ్ నియోజకవర్గంలో ని యోజకవర్గ ఇన్‌చార్జి ఆడే గజేందర్, మాజీ ఎంపీ సోయం బాపూరావు, జిల్లా పరిధిలో రెండేసి మండలాల చొప్పున ఉన్న ఖానా పూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆత్రం సుగుణ, సీనియర్ నాయకుడు నరేశ్ జాదవ్, ఆసిఫాబాద్‌లో ముఖ్య నాయకుల మధ్య ఈ కమిటీల ఏర్పాటు విషయంలో విభేదాలున్నాయి.
పరిశీలకుల ఎత్తుగడ ఎలా ఉంటుందో..
ఈ నేపథ్యంలో పరి శీలకుల ఎత్తుగడ ఎలా ఉంటుంది?.. నాయకుల మధ్య సమన్వయం సాధిస్తారా?.. సామాజిక న్యాయానికే పెద్దపీట వేస్తారా?.. సమతూకాన్ని ఎలా సాధిస్తారనే చర్చ పార్టీలో జిల్లా వ్యాప్తంగా జోరుగా సాగుతోంది.
పట్టు నిలుపుకోవాలని..
జిల్లా అధ్యక్ష స్థానాన్ని దృష్టిలో పెట్టుకుని కొందరు ముఖ్య నాయకులు ఈ కమిటీల ఏర్పాటులో ఎవరి వర్గానికి వారు పెద్దపీట వేసి పార్టీలో పట్టు నిలుపుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని మండలాల్లో ముఖ్య నాయకుల నుంచి వారి అనుచరులకు ప్రాధాన్యం ఇవ్వాలనే డిమాండ్ వస్తోంది. ప్రధానంగా బోథ్ నియోజకవర్గంలో ఈ పరిస్థితి అధికంగా ఉంది. అక్కడ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, డీసీసీబీ అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యులు మల్లెపూల నర్సయ్య, గోక గణేశ్‌రెడ్డి తమ అనుచరులకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో అందరి మధ్య సమన్వయం సాధించేందుకు పరిశీలకులు ప్రయత్నిస్తున్నారు. ప్రధానంగా ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల్లో పార్టీ ఎమ్మెల్యేలు లేక నియోజకవర్గ ఇన్‌చార్జ్జీలకే ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో వారు సూచించిన పేర్లకే మొదటి ప్రాధాన్యం ఇచ్చేందుకు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో చివరికి మిగతా వారి నుంచి ఎలాంటి ప్రతిఘటన ఎదురవుతుందో.. అనేది వేచి చూడాల్సిందే.
సామాజిక న్యాయానికే పెద్దపీట
ఈనెల 26, 27 తేదీల్లో రా ష్ట్ర కమిటీ ఏర్పాటు కానుండగా జిల్లా నాయకులకూ చోటు దక్కనుంది. సామాజిక న్యాయానికి పెద్దపీట ఉంటుంది. సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ఆదేశాలు, జిల్లా ముఖ్య నాయకుల సూచనలు పరిగణనలోకి తీసుకుని కమిటీలు ఏర్పాటు చేస్తున్నాం. బూత్, గ్రామ, మండల, నియోజకవర్గానికి రెండు బ్లాక్ కాంగ్రెస్ కమిటీల చొప్పున ఎంపిక చేస్తాం. ఈ ప్రక్రియ పూర్తి చేసి పార్టీని పూర్తిస్తాయిలో పటిష్టపరుస్తాం.
– తాహెర్‌బిన్ హందన్, పార్టీ పరిశీలకుడు

● త్వరలో కాంగ్రెస్ కమిటీల ఎంపిక ● ఆధిపత్యం కోసం నేతల ప