
దేశ సేవకే అంకితమయ్యాడు
నా పెద్ద కొడుకు రంగారావ్ ఆర్మీలో చేరి దేశ రక్షణ కోసం పోరాడాడు. విధి నిర్వహణలోనే ప్రాణాలొదిలాడు. 2005లో హిమాచల్ ప్రదేశ్‌లో సట్లేజ్ నది దాటుతున్న క్రమంలో అందులో పడి అమరుడయ్యాడు. కనీసం మృతదేహం కూడా లభ్యం కాలేదు. అయినా దేశం కోసం ప్రాణాలర్పించిన జవాన్‌ను కన్న తల్లిగా నేను గర్వపడుతున్నా. బిడ్డ గుర్తుకు వచ్చినప్పుడల్లా కన్నీళ్లు ఆగవు. అయినా వాటిని దిగమింగుతా. నా కొడుకు విగ్రహాన్ని సమాఖా చౌరస్తాలో ఏర్పాటు చేశారు. గుర్తుకొచ్చినప్పుడల్లా అక్కడికి పోతా. విగ్రహాన్ని తాకుతా. ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటా. – అంతర్వేది దాసోదిబాయి
(రంగారావ్ తల్లి), గోపాల్‌సింగ్‌తండా, ఇంద్రవెల్లి

దేశ సేవకే అంకితమయ్యాడు