
అమ్మ కోరిక.. నాన్న ప్రోత్సాహం
– కే అఖిల్, ఎస్‌హెచ్‌వో, నార్నూర్
కుటుంబ నేపథ్యం..: మాది నిజామాబాద్ లోకల్. అమ్మ జ్యోతి పోలీస్‌శాఖలో సూపరింటెండెంట్‌గా పనిచేశారు. 2019లో లోకం విడిచారు. నాన్న రమేశ్ ఏఎస్సై నిజామాబాద్‌లో పని చేస్తున్నారు. తమ్ముడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.
విద్యాభ్యాసం: ఇంటర్ వరకు నిజామబాద్‌లోనే సాగింది. బీటెక్ హైదరాబాద్‌లో పూర్తి చేశా.
లక్ష్యసాధన: కొంతకాలం సాఫ్ట్‌వేర్‌గా పనిచేశా. అది సంతృప్తి లేకుండే. అమ్మ కోరిక, నాన్న ప్రోత్సాహంతో పోలీస్ జాబ్ కోసం మళ్లీ ప్రిపరేషన్ మొదలుపెట్టా. తొలిప్రయత్నంలో ఓటమి ఎదురైంది. నిరాశ చెందలేదు. ప్రణాళికాబద్ధంగా చదివా. రెండో ప్రయత్నంలో ఎస్సై జాబ్ సాధించా.
సమాజంలో మీరు కోరుకునే మార్పు..: సమాజంలో శాంతియుత వాతావరణం నెలకొనాలి. ఇందుకోసం నావంతు ప్రయత్నం చేస్తా.
నిరుద్యోగులకు మీరిచ్చే సూచన: లక్ష్యాన్ని ఏర్పర్చుకొని ప్రణాళికాబద్ధంగా సాధన చేస్తే విజయం తప్పకుండా సొంతమవుతుంది.

అమ్మ కోరిక.. నాన్న ప్రోత్సాహం