సౌత్‌జోన్ ఆక్వాటిక్ పోటీలకు చరణ్ తేజ
ఆదిలాబాద్: జిల్లా కేంద్రానికి చెందిన కొమ్ము చరణ్ తేజ 36వ సౌత్‌జోన్ ఆక్వాటిక్ చాంపియన్‌షిప్ పోటీలకు ఎంపికయ్యాడు. హైదరాబాద్‌లోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో నేటి నుంచి ఈ నెల 29 వరకు నిర్వహించనున్న సబ్ జూనియర్, జూనియర్ స్థాయి పోటీల్లో రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించనున్నాడు.ఈమేరకు ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బాలూరి గోవర్ధన్ రెడ్డి, డీవైఎస్‌వో జక్కుల శ్రీనివాస్, డీటీఎస్‌వో పార్థసారథి, స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సాయిని రవికుమార్, కొమ్ము కృష్ణ తదితరులు అభినందించారు.


