పెసా మహోత్సవ సభలో ‘గుస్సాడి’ ప్రతిభ
ఉట్నూర్‌రూరల్: కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 23, 24 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించిన పెసా మహోత్సవ సభకు ఉట్నూర్ ఐటీడీఏ నుంచి పద్మశ్రీ కనకరాజు గుస్సాడి కళాబృందం హాజరైంది. ఇందులో ఆదివాసీల సంప్రదాయ కళలు, నృత్యాలు ప్రదర్శించినట్లు పెసా జిల్లా కోఆర్డినేటర్ అర్క వసంత్ తెలిపారు. దేశంలోని 10 రాష్ట్రాల ఏజెన్సీ ప్రాంతాల నుంచి ఆదివాసీలు హాజరై ప్రదర్శనలిచ్చినట్లు పేర్కొన్నారు. వీటిలో ఉట్నూర్ ఐటీడీఏ నుంచి పద్మశ్రీ కనకరాజు గుస్సాడి నృత్య కళాబృందం ప్రదర్శనలు ఆకట్టుకున్నట్లు వివరించారు. అలాగే ఇప్ప లడ్డూ, డ్వాక్రా బృందం తయారు చేసిన వస్తువుల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచినట్లు తెలిపారు. ప్రదర్శనకు వెళ్లిన వారిలో బృందం సభ్యులు దేవ్‌రావు, భోవేరావు, బాదిరావు, నవనీత్, సంజీవ్, అర్జున్, నాగరాజు, తదితరులున్నారు.
పెసా మహోత్సవ సభలో ‘గుస్సాడి’ ప్రతిభ


