పల్లె పాలనలో ‘ఆమె’
బోథ్: ఒకప్పుడు ఇంటి సరిహద్దులే ప్రపంచంగా బతికిన మహిళలు నేడు పల్లె ప్రగతికి దిక్సూచిగా మారుతున్నారు. 50 శాతం రిజర్వేషన్ల ఫలంతో జిల్లా వ్యాప్తంగా చాలా పంచాయతీల్లో మహిళా పాలన మొదలైంది. అయితే పురుషాధిక్య రాజకీ య క్షేత్రంలో తలొంచకుండా తమదైన ముద్ర వేసేందుకు మహిళా సర్పంచులు పాటుపడాలి.
నిర్ణయం ఆమెదే కావాలి..
గతంలో మహిళ సర్పంచ్‌గా గెలిచినా భర్తే అన్ని వ్యవహారాలు చూసుకోవడం అనే సంస్కృతి ఉండేది. ప్రస్తుతం గెలిచిన మహిళా సర్పంచులు చాలా చోట్ల విద్యావంతులైన గృహిణులు, ఉత్సాహవంతులైన యువతులు ఈసారి పగ్గాలు చేపట్టారు. ఫైలు మీద సంతకం నుంచి, నిధుల మంజూరు దాకా ప్రతీ విషయంలోనూ వారు చొరవ చూపాల్సిన అవసరం ఉంది.
పారదర్శక పాలన అందిస్తా..
అవినీతి అంటే నాకు నచ్చదు. పంచాయతీకి వచ్చే నిధులు ఎక్కడ ఖర్చవుతున్నాయో ఊరి మధ్యలో బోర్డు పెడతాను. ప్రజలు నన్ను నమ్మి ఓటేశారు. పారదర్శకమైన పాలన అంటే ఏంటో చూపిస్తాను. – పస్వే పూజ, సర్పంచ్,
కోఠ కె, సొనాల మండలం
గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా
గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాను. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తా. ప్రతీ కాలనీని సందర్శించి సమస్యలను పరిష్కరిస్తా. మహిళా సర్పంచ్‌గా గెలుపొందడం ఆనందంగా ఉంది. – ఆకుల అనిత, సర్పంచ్,
కనుగుట్ట, బోథ్ మండలం
జిల్లాలో..
మొత్తం సర్పంచులు 473
మహిళా సర్పంచులు 215
స్వచ్ఛ పల్లె నినాదంతో ముందుకు..
చెత్తా చెదారం లేని గ్రామాన్ని చూడాలన్నదే నా కల. ప్రతీ వీధిలో డ్రెయినేజీ వ్యవస్థను మెరుగుపరుస్తా. ‘స్వచ్ఛ పల్లె’ నినాదంతో ఇంటింటికీ తిరిగి చెత్త సేకరణను పర్యవేక్షిస్తా. నన్ను రెండోసారి గెలిపించిన గ్రామస్తుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా.
– పంద్రం సుగుణ, సర్పంచ్, పట్నాపూర్, బోథ్ మండలం
పల్లె పాలనలో ‘ఆమె’
పల్లె పాలనలో ‘ఆమె’


