ప్రాదేశిక ఎన్నికల్లోనూ సత్తా చాటాలి
కై లాస్‌నగర్: గ్రామ పంచాయతీ ఎన్నికల స్ఫూర్తితో ప్రాదేశిక ఎన్నికల్లోనూ సత్తా చాటాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పట్టణంలోని రత్నా గార్డెన్‌లో డీసీసీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన సర్పంచ్‌ల ఆత్మీయ సత్కార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డుసభ్యులను శాలువాలతో సత్కరించి అభినందించారు. రానున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ మరింత మెరుగైన ఫలితాలు సాధించేలా సర్పంచులు కీలకపాత్ర పోషించాలన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు నరేశ్‌జాదవ్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తహర్ బిన్ హందాన్, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, గ్రంథాలయ చెర్మన్ మల్లెపూల నర్సయ్య, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి, మాజీ ఎంపీ సోయం బాపూరావు, మాజీ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రాథోడ్ బాపూరావు, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ, బోథ్ అసెంబ్లీ ఇన్‌చార్జి ఆడె గజేందర్, ఆసిఫాబాద్ అసెంబ్లీ ఇన్‌చార్జి శ్యామ్ నాయక్, డీసీసీబీ మాజీ చైర్మన్ భోజారెడ్డి, బోరంచు శ్రీకాంత్ రెడ్డి, సాజిద్ ఖాన్, గండ్రత్ సుజాత తదితరులు పాల్గొన్నారు.
చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తాం
నేరడిగొండ: రైతులు పండించిన ప్రతీ గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశా రు. శుక్రవారం జిల్లాకేంద్ర పర్యటనకు వెళ్తున్న క్రమంలో మార్గమధ్యలో మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. అక్కడి రైతులతో మా ట్లాడారు. పంట అమ్ముకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని రైతులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన మంత్రి చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు.


