● ఎన్నికల సమయంలోనే రాజకీయాలు ● కేంద్ర బొగ్గు గనులశాఖ మం
ఆదిలాబాద్‌టౌన్: ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రి ఆవరణలో రూ.23 కోట్లతో నిర్మించిన క్రిటికల్ కేర్ యూనిట్‌ను రాష్ట్ర ఎకై ్సజ్, టూరిజం, జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలోనే రాజకీయాలని, ఆ తర్వాత అభివృద్ధి విషయంలో రాజకీయ జోక్యాలు తీసుకురావద్దని అన్నారు. ఆదిలాబాద్–ఆర్మూర్ రైల్వే లైన్ సర్వే చేయిస్తున్నామని చెప్పారు. మంచిర్యాలకు గ్రీన్‌ఫీల్డ్ హైవే వస్తుందన్నారు. వైద్య విద్యకు అధిక ప్రాధాన్యం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతీ జిల్లాలో మెడికల్ కళాశాల మంజూరు చేస్తున్నామని తెలిపారు. రైతులు సహజసిద్ధమైన వ్యవసాయ పద్ధతులు అనుసరించాలన్నారు. రంగు మారిన సోయా కొనుగోలు చేసేందుకు కృషి చేస్తామన్నారు. దేశంలోని ప్రతీ జిల్లాలో మెడికల్ కళాశా ల ఏర్పాటుతో పాటు పీజీ సీట్లు పెంచేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రధానమంత్రి సడక్ యోజన కింద జిల్లాలో అనేక గ్రామాలకు రోడ్లు వేశామని తెలిపారు. రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి కేంద్రం రూ.120 కోట్లు కేటాయించిందని, రాష్ట్ర ప్రభుత్వం రూ.30 కోట్లతో ఈ ఆస్పత్రిని నిర్మించిందని పేర్కొన్నారు. రాజకీయాలు స్నేహపూర్వకంగా ఉండాలని, గతంలో పీవీ నర్సింహారా వు ప్రధానిగా ఉన్న సమయంలో ఐక్యరాజ్య సమితి లో జరిగిన సమావేశానికి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వాజ్‌పేయిని ప్రతినిధిగా పంపారని గుర్తు చే శారు. అయితే ప్రధానమంత్రి రామగుండంలో జరి గిన కార్యక్రమానికి హాజరైతే అప్పటి ముఖ్యమంత్రి హాజరు కాలేదని పేర్కొన్నారు. అలాంటి రాజకీయాలు మంచిది కాదని పేర్కొన్నారు. రైతులు సాగులో రసాయనాల వాడకం తగ్గించి సహజసిద్ధమైన వ్యవసాయం చేస్తే బాగుంటుందన్నారు. జిల్లా కు ఒక డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నా రు. ఆయుష్మాన్ భారత్ కింద రూ.5లక్షల వరకు ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నామని, జిల్లాలో 8లక్షల మందికి కార్డులు అందజేసినట్లు పేర్కొన్నారు. ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు సర్వే జరుగుతుందని తెలిపారు. మార్చి వరకు పత్తి కొనుగోళ్లు చేస్తామని రైతులు అధైర్య పడొద్దని పేర్కొన్నారు.
జిల్లాకు ఎంత చేసినా తక్కువే..: మంత్రి జూపల్లి కృష్ణారావు
వెనుకబడి ఉన్న ఆదిలాబాద్ జిల్లాకు ఎంత చేసినా తక్కువేనని జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రిమ్స్‌కు అవసరమైన వైద్యపోస్టులు మంజూరు చేసేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్నప్పటికీ ప్రైవేట్ ఆస్పత్రుల్లో పేదలకు నాణ్యమైన వైద్యసేవలు అందించేలా ఆరోగ్యశ్రీని రూ.5లక్షల నుంచి 10లక్షలకు పెంచినట్లు తెలిపారు. రూ.800 కోట్ల సీఎంఆర్ నిధులు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే 6,956 స్టాఫ్‌నర్స్ పోస్టులను, 4,338 వైద్య పోస్టులను భర్తీ చేసినట్లు తెలిపారు. రిమ్స్‌లో ప్రతీ రోగికి నాణ్యమైన సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. త్వరగా ఎయిర్‌పోర్టు నిర్మాణం చేపడితే స్థానిక నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలతో పాటు జిల్లా అభివృద్ధి చెందుతుందన్నారు. నియోజకవర్గానికి ఒక కల్చరల్ బిల్డింగ్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం ఎంపీ నగేశ్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌లు మాట్లాడారు. రిమ్స్‌తో పాటు ఉట్నూర్, బోథ్ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న వైద్య పోస్టులను భర్తీ చేయాలని, ఇచ్చోడ పీహెచ్‌సీని ఏరియా ఆస్పత్రిగా మార్చాలన్నారు. జన్నారంలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పా టు చేయాలని, జిల్లా కేంద్రంలో ఎక్స్‌లెన్స్ సెంటర్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ప్రత్యేక జీవో తీసుకొచ్చి వైద్యులకు రూ.5లక్షల వేతనం ఇచ్చి స్పెషలిస్ట్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. రిమ్స్‌లో క్రిటికల్ కేర్ విభాగం ప్రారంభంతో అత్యవసర సేవలు మెరుగుపడతాయని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు దండే విఠల్, కొమురయ్య, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఆర్డీవో స్రవంతి, గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి తదితరులు పాల్గొన్నారు.
కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు మంత్రి కిషన్ రెడ్డి ఫోన్
ఆదిలాబాద్: జిల్లాలో అకాల వర్షాలతో నష్టపోయిన సోయా రైతుల పంటను కొనుగోలు చేయాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి శుక్రవారం ఫోన్ చేశారు. జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రిని బీజేపీ రాష్ట్ర నాయకురాలు సుహాసినిరెడ్డి కలసి చేసిన విజ్ఞప్తి మేరకు ఆయన మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. త్వరలోనే ఈ విషయమై సానుకూల నిర్ణయం తీసుకుంటామని మంత్రి కిషన్ రెడ్డి హామీ ఇచ్చినట్లు సుహాసిని రెడ్డి తెలిపారు.
బీజేపీ బలపరిచిన సర్పంచ్‌లకు సన్మానం
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని ఎస్టీయూ భవన్‌లో జిల్లాలో బీజేపీ బలపరిచి గెలిచిన సర్పంచ్‌ల సన్మాన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. సర్పంచ్‌లను సన్మానించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. నూతనంగా ఎన్నికై న సర్పంచులు గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు.
వినతుల వెల్లువ
ఆదిలాబాద్‌టౌన్: కేంద్ర ప్రభుత్వం గిరిజనుల కోసం తెలంగాణకు కేటాయించిన యూనివర్సిటీని ఉట్నూర్‌లో ఏర్పాటు చేయాలని ఏబీవీపీ నాయకులు కోరారు. శుక్రవారం జిల్లా కేంద్రానికి వచ్చిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నాయకులు కేంద్ర మంత్రికి వినతిపత్రం సమర్పించారు. ఇందులో సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీకాంత్, జలందర్‌రెడ్డి ఉన్నారు.
ఎయిర్‌పోర్టు నిర్మాణ స్థల పరిశీలన
కై లాస్‌నగర్: జిల్లా కేంద్రంగా చేపట్టే ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని ఎరోడ్రమ్‌లో చేపట్టనున్న ఎయిర్‌పోర్టు నిర్మాణ స్థలాన్ని శుక్రవారం సాయంత్రం ఎంపీ నగేష్, ఎమ్మెల్యే శంకర్, విమానాశ్రయాల అథా రిటీ ఆఫ్ ఇండియా అధికారులతో కలిసి పరి శీలించారు. అవసరమైన భూసేకరణ ప్రక్రియ, నిర్మాణ స్థలం మ్యాపింగ్, ఇతర సాంకేతిక అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సంబంధించిన మ్యాపులను పరిశీలించా రు. ఈ విమానాశ్రయం భవిష్యత్తులో ఈ ప్రాంత ఆర్థి కాభివృద్ధికి, పర్యాటక రంగానికి ఊతమిస్తుంద ని పేర్కొన్నారు. ఆయన వెంట ఎమ్మెల్సీ కొమురయ్య, అదనపు కలెక్టర్ ఎస్.రాజేశ్వర్, ఎస్పీ అఖిల్ మహాజన్, ఆర్డీఓ స్రవంతి, మున్సిపల్ కమిషనర్ రాజు,అధికారులు,తదితరులున్నారు.
● ఎన్నికల సమయంలోనే రాజకీయాలు ● కేంద్ర బొగ్గు గనులశాఖ మం


