
పెండింగ్ పనులు పూర్తి చేయాలి
కై లాస్‌నగర్: ఆదిలాబాద్ నియోజకవర్గ పరిధిలో పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి జోగు రామన్న కలెక్టర్ రాజర్షి షాను కోరారు. గురువారం కలెక్టర్‌ను క్యాంపు కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రామన్న మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ హయాంలో మంజూరైన కళాశాలలు, ఇతర అభివృద్ధి పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. వ్యవసాయ కళాశాలకు స్థలం కేటాయించడంతోపాటు ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బేల, ఇచ్చోడ మండలాల పరిధిలో మార్క్‌ఫెడ్ ద్వారా శనగలు విక్రయించిన రైతులకు డబ్బులు జమ చేయాలని కోరారు. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో రైతులకు భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. జైనథ్ మండలంలో 132/33 కేవీ సబ్‌స్టేషన్ ఏర్పాటులో తీవ్ర జాప్యం జరుగుతోందని తెలిపారు. వెంటనే సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. సమస్యల పరి ష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చి నట్లు జోగు రామన్న తెలిపారు. ఆయన వెంట మా ర్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, బీఆర్‌ఎస్ నాయకుడు కుమ్ర రాజు తదితరులున్నారు.