
సమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ
ఆదిలాబాద్‌టౌన్: బాధితుల సమస్యలను సత్వరం పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీస్ అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లాలోని ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 30 మంది తమ సమస్యలను ఎస్పీకి విన్నవించారు. ఈ మేరకు ఆయన సంబంధిత అధికారులతో వెంటనే ఫోన్‌లో మాట్లాడి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఎలాంటి అత్యవసర సమయంలో అయినా బాధితులు డయల్ 100లో సంప్రదించవచ్చని పేర్కొన్నారు. అసాంఘిక కార్యకలాపాలు దృష్టికి వస్తే ‘డయల్ ఎస్పీ’ కార్యక్రమంలో భాగంగా 8712659973 నంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. కార్యక్రమంలో సీసీ కొండ రాజు, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారి కవిత తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ అఖిల్ మహాజన్