● ఎస్పీ అఖిల్ మహాజన్
‘వీపీవో’ పటిష్టంగా అమలు చేయాలి
నేరడిగొండ: విలేజ్ పోలీస్ ఆఫీసర్ వ్యవస్థ పటిష్టంగా అమలు చేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. నేరడిగొండ పోలీస్ స్టేషన్‌ను మంగళవారం తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతీ పోలీసుకు కేటాయించిన గ్రామాన్ని ఎప్పటికప్పుడు సందర్శించాలన్నారు. సమాచార వ్యవస్థ పటిష్టం చేసుకొని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలన్నారు. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలన్నారు. అలాగే మైనర్ డ్రైవింగ్‌పై దృష్టి సారించాలన్నారు. బహిరంగ మాద్యపానం జరగకుండా డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహించాలన్నారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితులకు సంబంధించి సీఈఐఆర్ ద్వారా ఫిర్యాదులు నమోదు చేస్తూ వారికి భరోసా కల్పించాలన్నారు. ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఎస్పీ వెంట ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్, ఇచ్చోడ సీఐ భీమేష్, నేరడిగొండ ఎస్సై ఎల్.శ్రీకాంత్, సిబ్బంది ఉన్నారు.
చిల్డ్రన్ పార్క్ ప్రారంభం
చిన్ననాటి నుంచే వ్యాయామం అలవర్చుకుంటే ఆరోగ్యంగా ఉంటారని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో చిన్నపిల్లల కోసం ఏర్పాటు చేసిన పార్కును మంగళవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఇందులో ఏఎస్పీ కాజల్‌సింగ్ తదితరులున్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
ఆదిలాబాద్‌టౌన్: హైదరాబాద్‌లోని దుర్గాబాయి దేశ్‌ముఖ్ ప్రభుత్వ మహిళా టెక్నికల్ శిక్షణ సంస్థలో 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించి పాలి టెక్నిక్ డిప్లొమా కోర్సుల కోసం దరఖాస్తులు ఆహ్వా నిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి కె.మిల్కా ప్రకటనలో తెలిపారు. తల్లిదండ్రులను కోల్పోయిన అ నాథలు, తల్లి లేదా తండ్రిని కోల్పోయిన బాలికలు మాత్రమే దరఖాస్తుకు అర్హులని పేర్కొన్నారు. కు లం,ఆదాయం(అనాథ బాలికలకు అవసరంలేదు), మరణ ధ్రువీకరణ పత్రం, బోనఫైడ్ పత్రాలు దరఖాస్తుకు జతచేసి జిల్లా కేంద్రంలోని బాలరక్షా భవన్‌లో ఈనెల 18లోగా అందించాలని సూచించా రు. వివరాల కోసం 9493433400, 9966490203 నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు.


