
‘ఇందిరమ్మ’ కోసం ప్రత్యేక కౌంటర్
కై లాస్‌నగర్: ఇందిరమ్మ ఇళ్ల ఫిర్యాదుల స్వీకరణకు కలెక్టరేట్ సమావేశ మందిరం వద్ద సోమవారం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. జెడ్పీ, మున్సిపల్, హౌసింగ్ శాఖల ఉద్యోగులు మధ్యాహ్నం 2గంటల వరకు అందుబాటులో ఉండి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఆదిలాబాద్ పట్టణంతో పాటు వివిధ మండలాల నుంచి 25 ఫిర్యాదులు అందాయి. ఇందులో అత్యధికంగా అనర్హులకే ఇళ్లు కేటా యించారని పేర్కొనడం గమనార్హం. కాగా గత సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో ఇందిర మ్మ ఇళ్లపైనే అత్యధిక ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో కలెక్టర్ స్పందించి ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తదుకనుగుణంగా మున్సిపల్ ఆధ్వర్యంలో ఈ కౌంటర్ అందుబాటులోకి తెచ్చారు.
‘విద్యుత్ గ్రీవెన్స్’ సద్వినియోగం చేసుకోండి
● ఎస్‌ఈ జేఆర్ చౌహాన్
ఆదిలాబాద్‌టౌన్: వి ద్యుత్ వినియోగదా రుల సమస్యల పరి ష్కారామే ధ్యేయంగా చేపట్టిన విద్యుత్ ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ట్రాన్స్‌కో ఎస్‌ఈ జేఆర్. చౌ హాన్ అన్నారు. సోమవారం తన కార్యాలయంలో విద్యుత్ వినియోగదారుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ, 2024 జూన్ 17న శ్రీ కారం చుట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా ఇ ప్పటి వరకు 754 ఫిర్యాదులు అందగా 699 ప రిష్కరించామన్నారు. విద్యుత్ బిల్లులు, మీ టర్లు, కరెంట్ సరఫరాలో హెచ్చు తగ్గులు, కేట గిరీ, పేరు మార్పు, ప్రమాద భరిత స్తంభాలు వంటి ఫిర్యాదుల్లోని సమస్య తీవ్రత ప్రకారం అప్పటికప్పుడు పరిష్కరించినట్లు తెలిపారు. కొన్ని సమస్యలను సమయం తీసుకొని పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. సర్కిల్ పరిధిలోని డివిజన్ ఆఫీస్, ఈఆర్వో, సబ్‌డివిజన్ ఆఫీస్, సెక్షన్ ఆఫీస్‌లలో ఈ ప్రజావాణి ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. ప్రతి సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, సర్కిల్ ఆఫీస్‌లో అదే రోజు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5గంటల వరకు ఫిర్యాదులు అందించవచ్చని తెలిపారు. గ్రీవెన్స్‌లో అందిన ఆయా సమస్యలను సకాలంలో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

‘ఇందిరమ్మ’ కోసం ప్రత్యేక కౌంటర్