
తాగునీటి సమస్య రానివ్వద్దు
కై లాస్‌నగర్: గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజర్షి షా ఆ దేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో తాగునీటి సరఫరాపై ఎంపీడీవోలు, ఎంపీవోలు, మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించి మాట్లాడారు. స్థానిక నీటి వనరులు, వా టర్ ట్యాంకర్లను వినియోగించుకోవాలని సూ చించారు. మిషన్ భగీరథ, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఓహెచ్‌ఎస్‌ఆర్ ట్యాంకుల్లో క్లోరినేషన్ చేసి నీటిని సరఫరా చేయాలని సూచించారు. గ్రామాలు, పట్టణాల్లో మిషన్ భగీరథ నీరు వృథా కాకుండా నిరంతరం పర్యవేక్షించాలన్నారు. లాండసాంగ్వి ఇన్‌టెక్‌వెల్ పంప్‌హౌస్ వద్ద రూ.40లక్షలతో చేపట్టిన మరమ్మ తు పనుల అనంతరం సరిపడా నీటిని సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. 170 సర్వే ప్లాట్ల వద్ద వి ద్యుత్ సరఫరా లేని కారణంగా ట్యాంకుల ద్వారా నీటిని అందించాలని సూచించారు. లీకేజీలుంటే యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు చేసి నిరంతరం నీటి సరఫరా చేయాలని సూచించారు. చేతిపంపులకు సంబంధించిన విడిభాగాల టెండర్లను పూర్తి చేసి ఏరోజుకారోజు మరమ్మతు చేపట్టాలని ఆదేఽశించారు. ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ శ్రావణ్‌కుమార్, డీపీవో శ్రీలత, డీఎల్పీవో ఫణీందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాజర్షిషా
అధికారులతో సమీక్ష