మార్పునకే రైతుల ఆసక్తి
అధికారులు, శాస్త్రవేత్తల సూచనలు పరిగణనలోకి తీసుకున్న రైతులు వానాకాలంలో స్వల్ప కాలిక పత్తి విత్తనాల సాగువైపు దృష్టి సారిస్తున్నారు. యాసంగిలో అదనపు పంట సాగు చేయాలనే దృక్పథం రైతుల్లో కనిపిస్తోంది. గతంలో దీర్ఘకాలిక రకాన్ని వేసి యాసంగి లోనూ దానికే నీటి తడులు అందించడం ద్వారా కొద్దిపాటి దిగుబడి తీసేవారు. వా నాకాలంలో స్వల్పకాలిక పత్తి రకం చేసి యా సంగిలో రెండో పంట తీయడమే లాభసాటి కావడంతో రైతులు కోరుకుంటున్నారు.
– వివేక్, ఆదిలాబాద్ అర్బన్ ఏవో


