భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు
ఇంద్రవెల్లి: నాగోబా జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ రాజర్షిషా ఆయా అధికారులను ఆదేశించారు. ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి మంగళవారం నాగోబా ఆలయాన్ని సందర్శించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దర్బార్ హాల్‌లో జాతర ని ర్వహణపై ఆయా శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. జాతర ప్రారంభానికి ముందే ఏ ర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ఈసారి జాతర ఆహ్వా న పత్రాలను రాష్ట్రంతో పాటు కేంద్ర ప్రజాప్రతినిధులకు కూడా అందించాలని దేవాదాయ శాఖ అధి కారులకు సూచించారు. ఎస్పీ అఖిల్ మహాజన్ మా ట్లాడుతూ, జాతరకు భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పీవో మర్మాట్ మాట్లాడుతూ, మెస్రం వంశీయులు, భక్తులు తరలివచ్చే రహదారుల మరమ్మతు పనులు వెంటనే పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఇందులో శిక్షణ కలెక్టర్ సలోని చాబ్రా, శిక్షణ ఐపీఎస్ రాహుల్‌కాంత్, ఈవో ముక్త రవి, కేస్లాపూర్ సర్పంచ్ తుకారాం, నాగోబా ఆలయ పిఠాధిపతి మెస్రం వెంకట్‌రావ్, మెస్రం వంశ పెద్దలు చిన్ను పటేల్, కోసేరావ్ తదితరులున్నారు.


