డ్రంకెన్ డ్రైవ్ చెక్‌పోస్టుల ఏర్పాటు
ఆదిలాబాద్‌టౌన్: జిల్లా కేంద్రంలో ప్రత్యేకంగా 15 డ్రంకెన్ డ్రైవ్ చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. డిసెంబర్ 31, జనవరి 1న న్యూ ఇయర్ వేడుకలను అందరూ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. ఇతరులను ఇబ్బందులకు గురిచేయవద్దని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉందని తెలి పారు. వాహనదారులు మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. రాంగ్‌రూట్, రాష్ డ్రైవింగ్, స్పీడ్ రేసింగ్ వంటి వాటికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో కేక్‌లు కట్ చేయవద్దని, ఇండ్లపై బాక్సులు, మైక్ సిస్టమ్ ఏర్పాటు చేసుకునే వారు పోలీసుల అనుమతి తీసుకోవాలని సూచించారు. ర్యాలీలు, సభలు, సమావేశాలకు అనుమతి లేదని వివరించారు. వేడుకల్లో బాణసంచా పేల్చవద్దని తెలిపారు.


