భివృద్ధి దిశగా.. డుగులు
అ
కై లాస్‌నగర్: అడవుల జిల్లా ఆదిలాబాద్‌లో ఈ ఏడాది అభివృద్ధి వైపు వేగంగా అడుగులు పడ్డాయి. జిల్లావాసుల దశాబ్దాల కల సాకారం చేసేలా కేంద్ర ప్రభుత్వం ఆదిలాబాద్ కేంద్రంగా ఎయిర్‌పోర్టుతో పాటు ఎయిర్ స్ట్రిప్‌ను మంజూరు చేసింది. నిర్మాణానికి అవసరమైన భూసేకరణ చేపట్టాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో సైతం జారీ చేసింది. ఐటీ పరంగానూ జిల్లాను అభివృద్ధి చేసేందుకు రూ.40కోట్ల వ్యయంతో చేపట్టిన టవర్ నిర్మాణం తుదిదశకు చేరింది. మరిన్ని రైళ్లు జిల్లా గుండా ప్రయాణించేలా మరమ్మతులకు సంబంధించిన ఫిట్‌లైన్ పనులు కూడా కొనసాగుతున్నాయి. పరిపాలన కేంద్రమైన నూతన కలెక్టరేట్ నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇలా జిల్లా అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం అందుతోంది. నూతన సంవత్సరంలోనూ ఇదే ఒరవడి కొనసాగితే జిల్లా మరింత ప్రగతి సాధించే అవకాశముందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.
తుది దశకు ఐటీ టవర్ నిర్మాణం
నగరాలకే పరిమితమైన ఐటీ సేవలను మారుమూల ప్రాంతాలకు సైతం విస్తరించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ఆదిలాబాద్‌లో ఐటీ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని భావించింది. ఇందుకోసం రూ.40 కోట్లు మంజూరు చేసింది. దీంతో మావల మండలం బట్టిసావర్‌గాం పరిధిలో 50వేల చదరపు అడుగులవైశాల్యంలో టవర్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో బీడీఎన్‌టీ, ఎన్‌టీటీ కంపెనీలు ఐటీ సేవలను నిర్వహిస్తున్నాయి. టవర్ నిర్మాణం పూర్తయినట్లయితే మరిన్ని కంపెనీలు జిల్లాకు వచ్చే అవకాశముంది. దీంతో ఇక్కడి యువతకు ఐటీ రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి.
చకచకా ఫిట్‌లైన్ పనులు
జిల్లాకు రైళ్ల సంఖ్య మరింతగా పెంచాలనే ఉద్దేశంతో రైళ్ల నిర్వహణ పనులు చేపట్టేందుకు వీలుగా రూ.17కోట్ల వ్యయంతో ఆదిలాబాద్ రైల్వేస్టేషన్‌కు 600 మీటర్ల పొడవుతో ఫిట్‌లైన్ మంజూరు చేసింది. ప్రస్తుతం మహారాష్ట్రలోని నాందేడ్ డివిజన్ కేంద్రంగా రైళ్లకు మరమ్మతులు, నిర్వహణ పనులు సాగుతున్నాయి. అక్కడ రైళ్ల తాకిడి పెరిగినందున జిల్లా కేంద్రంలోనే ఫిట్‌లైన్ పనులను చేపట్టారు. ప్రస్తుతం ఈ పనులు చకచకా సాగుతున్నాయి. పూర్తయితే 24 కోచ్‌లకు ఒకేసారి మరమ్మతులు, నిర్వహణ, నీళ్లు నింపడం వంటి పనులు చేసేందుకు అవకాశముంటుంది.
జిల్లా కేంద్రంలో ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం ఈ ప్రాంత వాసులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు. వారి కల సాకారం చేసేలా జాతీయ ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా విమానాశ్రయంతో పాటు వాయు శిక్షణ కేంద్రం ఏర్పాటుకు ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సంబంధించిన డీపీఆర్ సైతం సిద్ధం చేస్తోంది. ఎరోడ్రమ్‌లో ప్రస్తుతం 362 ఎకరాల భూమి అందుబాటులో ఉండగా మరో 700 ఎకరాలు సేకరించాల్సిందిగా ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది నవంబర్ 3న ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే భూ సేకరణ పనులు మొదలయ్యే అవకాశముంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకెళ్తుండడంతో ఎయిర్‌బస్ కల త్వరలోనే నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఎయిర్‌పోర్టు నిర్మాణం చేపట్టనున్న ఎరోడ్రమ్ మైదానం
భివృద్ధి దిశగా.. డుగులు
భివృద్ధి దిశగా.. డుగులు


