జాతీయ స్థాయిలో గుర్తింపు
ఆదిలాబాద్ జిల్లాకు ఈ ఏడాది జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. నార్నూర్ ఆస్పిరేషననల్ బ్లాక్‌లో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమలను పకడ్బందీగా అమలు చేసినందుకు గాను ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా కలెక్టర్ రాజర్షి షా అవార్డు అందుకున్నారు. అలాగే జిల్లాలో నీటి సంరక్షణకు చేసిన కృషికి గాను జల్ సంచాయి జన్ బాగీదారి జాతీయ పురస్కారం దక్కింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా కలెక్టర్ ఈ అవార్డుతో పాటు రూ.2కోట్ల నజరానా అందుకున్నారు. అలాగే ఆరోగ్య పాఠశాలను ప్రయోగాత్మకంగా చేపట్టి పక్కాగా అమలు చేసినందుకు గాను జాతీయ స్థాయి స్కోచ్ పురస్కారాన్ని సైతం కలెక్టర్ సొంతం చేసుకుని జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చారు. వీటితో పాటు నార్నూర్ అస్పిరేషనల్ బ్లాక్‌లో జరిగిన అభివృద్ధికి గాను మరో మూడు ప్రత్యేక బహుమతులు సైతం జిల్లాకు దక్కాయి.


