
ఇక ఊరూరా క్షయ పరీక్షలు
సంవత్సరం టీబీ కేసులు
2022 1565
2023 1476
2024 1602
2025 1038 (ప్రస్తుతం చికిత్స
పొందుతున్నవారు)
ఆదిలాబాద్‌టౌన్: టీబీ మహమ్మారికి చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. దేశంలో 2025 ముగిసే సరికి క్షయను సమూలంగా నిర్మూలించేందుకు కసరత్తు చేస్తోంది. వ్యాధి నిర్మూలనే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. ఇందులో భాగంగా తెలంగాణలోని తొమ్మిది జిల్లాల్లో నిక్షయ్ శివిర్ వంద రోజుల కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జిల్లాలో సైతం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. 522 మంది వ్యాధిగ్రస్తులను గుర్తించారు. ఈ కార్యక్రమం సత్ఫలితాలు ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో టీబీ ముక్త్ భారత్ అభియాన్‌కి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇకనుంచి పల్లెల్లో ఇంటింటికీ టీబీ పరీక్షలు చేయనుంది. నిరంతర ప్రక్రియగా కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఇప్పటికే వైద్యాధికారులు, సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఊరూరా వైద్య పరీక్షలు, అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతో టీబీని అంతమొందించే అవకాశం ఉంది.
చాపకింద నీరులా..
టీబీ మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. అంటువ్యాధి కావడంతో ఒకరి నుంచి మరొకరికి గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. చాలా మంది ప రీక్షలు చేసుకునేందుకు ముందుకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, చుట్టుపక్కల వా రికి సోకుతుంది. వ్యాధి సోకినవారు చికిత్స తీసుకో కపోవడంతో టీబీ ముదిరి మృత్యువాత పడుతున్నారు. 3 నుంచి 5 శాతం మంది చనిపోతున్నట్లు తెలుస్తోంది. సకాలంలో మందులు వాడితే ఆరు నె లల్లోనే నయం అవుతుందని వైద్యులు సూచిస్తున్నా రు. టీబీలో రెండు రకాలు ఉండగా.. ఊపిరితిత్తులకు వచ్చిన టీబీ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుండగా, శరీరంలో ఇతర భాగాలకు వచ్చింది మాత్రం విస్తరించకుండా ఉంటుంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు దాదాపు 2వేల మందికి సోకగా, దాదాపు 25 మంది మృతి చెందినట్లు సమాచారం.
సత్ఫలితాలు ఇవ్వడంతో..
టీబీ నిక్షయ్ శివిర్ వంద రోజుల కార్యక్రమం ఆది లాబాద్ జిల్లాతో పాటు భద్రాచలం, మెదక్, నాగర్‌కర్నూల్, వనపర్తి, మహబూబ్‌నగర్, కరీంనగర్, పెద్దపల్లి, సూర్యపేట్‌లలో నిర్వహించారు. జిల్లాలో వంద రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు, స్క్రీనింగ్, వైద్య పరీక్షలు నిర్వహించారు. 4లక్షల 9వేల మందికి స్క్రీనింగ్ చేశారు. 10వేల మందికి పరీక్షలు నిర్వహించగా, 522 మందికి టీబీ నిర్ధారణ అయ్యింది. 953 క్యాంపులు నిర్వహించినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే వంద రోజుల్లో జిల్లా అంతటా కార్యక్రమాలు నిర్వహించలేక పోయారు. ఇకనుంచి ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా చేపట్టనున్నారు. ముఖ్యంగా షుగర్, బీపీ, టీబీ వ్యాధిగ్రస్తుల ఇంట్లో వారికి, 60ఏళ్లు పైబడిన వారికి, మద్యం, దూమపానం సేవించే వారు, బరువు తక్కువగా ఉన్నవారికి, అనుమానితులకు పరీక్షలు చేయనున్నారు.
గ్రామాల్లోనే ఎక్స్‌రేలు..
గ్రామ గ్రామాన నిర్వహించే పరీక్షల్లో అక్కడే ఎక్స్‌రేలు తీయనున్నారు. హ్యాండ్ హెల్డ్ ఎక్స్‌రే మిషన్ ద్వారా పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే తెమడ సేకరించి ట్రూనాట్ యంత్రం ద్వారా పరీక్షలు చేస్తారు. ఆదిలాబాద్, నార్నూర్, ఉట్నూర్, జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో ఈ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలో 1,038 మంది టీబీ మందులను వాడుతున్నారు.
ఈనెల 19న టీబీ ముక్త్ భారత్ అభియాన్‌కు శ్రీకారం
ప్రణాళిక సిద్ధం చేస్తున్న వైద్యశాఖ
వంద రోజుల కార్యక్రమంలో 522 మందికి వ్యాధి నిర్ధారణ
టీబీ రహిత జిల్లాగా మార్చేందుకు కసరత్తు
టీబీ నిర్మూలనే లక్ష్యం..
టీబీ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా ముందు కు సాగుతున్నాం. వంద రోజుల కార్యక్రమంలో భాగంగా పరీక్షలు చేయగా, 522 మందికి వ్యాధి నిర్ధారణ అయ్యింది. కేంద్ర ప్రభుత్వం దేశంలో 2025 నాటికి ఈ వ్యాధిని నిర్మూలించేందుకు టీబీ ముక్త్ భారత్ కార్యక్రమాన్ని చేపడుతోంది. ప్రతి ఒక్కరూ వైద్యపరీక్షలు చేసుకోవాలి. మందుల ద్వా రా వ్యాధి నయం అవుతుంది. అపోహలు వీడాలి.
– నరేందర్ రాథోడ్, డీఎంహెచ్‌వో
వ్యాధిగ్రస్తులకు ఉచిత చికిత్స
టీబీ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా పరీక్షలు చేయడంతో పాటు మందులు పంపిణీ చేస్తున్నాం. రిమ్స్, బోథ్, నార్నూర్, ఉట్నూర్ ఆస్పత్రుల్లో ట్రూనాట్ ద్వారా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాం. మందులు వాడితే ఆరు నెలల్లోనే వ్యాధి నయం అవుతుంది. వ్యాధిగ్రస్తులకు పోషకాహారం కోసం నెలకు రూ.వెయ్యి చొప్పున అందిస్తున్నాం.
– డాక్టర్ సుమలత,
జిల్లా టీబీ నిర్మూలన అధికారి