
ఆదిలాబాద్–గడ్‌చందూర్ రైల్వేలైన్ ఏర్పాటు చేయాలి●
ఆదిలాబాద్:ఆదిలాబాద్–గడ్‌చందూర్ నూత న రైల్వేలైన్ ఏర్పాటు చేయాలని ఎంపీ గోడం నగేశ్ అన్నారు. దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ జైన్‌ను మంగళవారం సికింద్రాబాద్‌లో కలిసి పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఆర్మూర్–ఆదిలాబాద్ రైల్వేలైన్ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని విన్నవించినట్లు తెలిపారు. అ లాగే జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న రైల్వేఓవర్, అండర్ బ్రిడ్జిలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కోరినట్లు పేర్కొన్నారు. ఆయన వెంట దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఉన్నారు.
శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ..
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని ఎంపీ నగేశ్ మంగళవారం త్రిపుర మాజీ సీఎం విప్లవ్ కు మార్‌దేవ్‌తో పాటు దర్శించుకున్నారు. వారి వెంట ఎంపీ హిమాద్రిసింగ్ ఉన్నారు.