
అమ్మే నా రోల్‌మోడల్..
అఖిల్ మహాజన్, ఎస్పీ
అమ్మ ఉర్మిల్ నాకు రోల్‌మోడల్. ప్రతీ విజయం వెనుక ఆమె ప్రోత్సాహం
ఎంతో ఉంది. సివిల్స్‌కు సిద్ధమవుతున్న సమయంలో ఎంతగానో మోటివేట్ చేశారు. కష్టపడి చదివితే అనుకున్న లక్ష్యం సాధించవచ్చని పదే పదే చెప్పేవారు. ఏ పనిలోనూ వెనుకడుగు వేయద్దనే వారు. ఇప్పటికీ అమ్మ మాటలు గుర్తుకొస్తాయి. క్రమశిక్షణ, ఎదుటి వ్యక్తులతో ఎలా ఉండాలనే విషయాలను చిన్నప్పటి నుంచే నేర్పించారు. ఉద్యోగం సాధించేంత వరకు వెన్నుదన్నుగా నిలిచారు. అందరి జీవితాల్లో అమ్మ ప్రత్యేకమే. అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. – ఆదిలాబాద్‌టౌన్