
జిల్లావాసికి డాక్టరేట్
ఆదిలాబాద్‌టౌన్: పట్టణంలోని కేఆర్‌కే కాలనీకి చెందిన తస్కండే లక్ష్మణ్–గంగ దంపతుల కుమార్తె ప్రియాంకకు డాక్టరేట్ లభించింది. జియో ఫిజిక్స్‌లో చేసిన పరిశోధనలకు గాను ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పట్టా అందుకోనున్నారు. ఈమె ప్రొఫెసర్ వీరయ్య మార్గదర్శకత్వంలో పరిశోధనలు చేశారు. నిర్మల్ జిల్లాలోని సుద్దవాగు బేసిన్‌లో జలాశయ సంభావ్య మండలాల మూల్యాంకనంతో పరిశోధనలు చేశారు. జియో మార్పోలాజికల్, జియో ఎలక్ట్రికల్ , జియో కెమికల్ విధానాలు ఉపయోగించి సమగ్ర అధ్యయనం చేశారు. ఇందుకు గాను ఓయూ డాక్టరేట్ ప్రకటించింది. ప్రస్తుతం ఈమె హైదరాబాద్‌లోని స్వయంకృషి స్పెషల్ బీఎడ్ కళాశాలలో కో ఆర్డినేటర్‌గా పనిచేస్తున్నారు. డాక్టరేట్ రావడంపై కుటుంబసభ్యులు, స్థానికులు వ్యక్తం చేఽశారు.