
ఆదివాసీ గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు
బోథ్: జిల్లాలోని ఆదివాసీ గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని ఎస్పీ అఖిల్ మహా జన్ అన్నారు. పోలీసుల ఆధ్వర్యంలో మండలంలో ని పట్నాపూర్‌లో నిర్మల్‌లోని స్వప్న ఆసుపత్రి సహకారంతో బుధవారం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. యు వత గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. లైసెన్స్ ఉంటేనే వాహనాలను నడపాలని, ఖచ్చితంగా హెల్మట్ ధరించాలని పేర్కొన్నా రు. అనంతరం వైద్యులు గ్రామస్తులకు వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్‌రెడ్డి, సీఐ వెంకటేశ్వరరావ్, ఎస్సై ప్రవీణ్ కుమార్, బోథ్ సీహెచ్‌సీ సూపరింటెండెంట్ రవీంద్ర ప్రసాద్, ఏజీపీ శంకర్, వైద్యులు శశికాంత్, స్వప్న, మల్లేశ్, సచిన్ బాబు, ధృవన్ కుమార్, రాహుల్, దినేష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.