
అక్క స్ఫూర్తితో..
– సాల్లురి శ్రీసాయి, ఎస్‌హెచ్‌వో, సిరికొండ
కుటుంబ నేపథ్యం : మాది నిజామాబాద్. నాన్న సాల్లురి కిషన్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. అమ్మ లక్ష్మి గృహిణి. అక్క శ్రీలత, పంచాయతీ కార్యదర్శి.
విద్యాభ్యాసం : ఒకటి నుంచి ఐదో తరగతి వరకు నిజామాబాద్‌లోని ప్రభుత్వ పాఠశాలలోనే సాగింది. నవోదయలో ఇంటర్ వరకు చదివి హైదరాబాద్‌లో బీటెక్ పూర్తి చేశా. మైసూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేశా.
లక్ష్యసాధన : కరోనా సమయంలో నేను వర్క్‌ఫ్రం హోం చేస్తుండగా.. అక్క పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుంది. గ్రామస్తుల సమస్యలను పరిష్కరిస్తున్న తీరు చూసి నేను కూడా సర్కారు కొలువు సాధించాలనుకున్నా. అక్క స్ఫూర్తితో ఇంటి వద్ద ప్రిపరేషన్ మొదలుపెట్టా. 2023 ఎస్సై ఫలితాల్లో విజయం సాధించా. చిన్నప్పుడు స్పోర్ట్స్ బాగా ఆడేది. ఉద్యోగ సాధనలో అది కలిసివచ్చింది.
సమాజంలో మీరు కోరుకునే మార్పు..: మత్తు పదార్థాలతో కలిగే దుష్పరిణామలపై ప్రజలకు అవగాహన కల్పిస్తా. వాటిని పూర్తిస్థాయిలో రూపుమాపడంలో నా వంతు కృషి చేస్తా.
నిరుద్యోగులకు మీరిచ్చే సూచన : కష్టపడి చదవాలి. లక్ష్యం సాధించే వరకు పట్టు సడలనివ్వొద్దు.